HMTV LIVE News Updates: విక్రమ్ ల్యాండ‌ర్‌ను గుర్తించింది ఇతడే !....దిశ ఘటనకు నిరసనగా..

HMTV LIVE News Updates: విక్రమ్ ల్యాండ‌ర్‌ను గుర్తించింది ఇతడే !....దిశ ఘటనకు నిరసనగా..
x
HMTV Live Latest News Updates
Highlights

నాసాను మించిపోయాడు.. విక్రమ్ ల్యాండ‌ర్‌ను గుర్తించింది ఇతడే !....దిశ ఘటనకు నిరసనగా, 3,200 కిలోమీటర్లు స్కూటర్‌పై ప్రయాణం

నాసాను మించిపోయాడు.. విక్రమ్ ల్యాండ‌ర్‌ను గుర్తించింది ఇతడే ! షణ్ముగ సుబ్రమ‌ణియ‌న్‌. వృత్తి రీత్యా మెకానిక‌ల్ ఇంజినీర్‌. బ్లాగ‌ర్‌ యాప్ డెవ‌ల‌ప‌ర్‌. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-2కు సంబంధించిన విక్రమ్ ల్యాండ‌ర్‌ను కూడా గుర్తించింది ఇత‌నే. ఈ చెన్నై చిన్నోడే విక్రమ్ జాడ‌ను తొలిసారి గుర్తించిన‌ట్లు నాసా కూడా అత‌నికి క్రెడిట్ ఇచ్చింది. లూనార్ ఆర్బిటార్ తొలిసారి తీసిన ఫోటోల‌ను డౌన్‌లోడ్ చేసుకుని వాటిని nప‌రిశీలిస్తున్న స‌మ‌యంలో ఇంజినీర్ ష‌ణ్ముగ‌కు కొన్ని డౌట్స్ వ‌చ్చాయి. వాటిని నాసా దృష్టికి తీసుకు వెళ్ళాడు. దానికి నాసా స్పందించింది.... పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్‌లో దిశ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. దీనిపై పలువురు ప్రముఖులు కూడా స్పందించారు. ఈ నేపథ్యంలో దిశ ఉదంతంపై ఉదయ్‌పూర్‌కు చెందిన ఓ యువతి నీతూ చోప్రా స్పందించారు. 28ఏళ్ల నీతూ చోప్రా రాజస్తాన్‌ లోని బలోత్రా నుంచి కన్యాకుమారి వరకూ 3,200 కిలోమీటర్లు స్కూటర్ పై ప్రయాణం చేయనున్నట్లు తెలిపారు. దిశ హంతకులను ఉగ్రవాదులుగా ఆమె వర్ణించారు.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నిన్న నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈరోజు దేశీయ మార్కెట్లలో తగ్గుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం స్థిరంగా మార్పులేకుండా నిలిచాయి. 03.12.2019 మంగళవారం పది గ్రాముల బంగారం ధర సోమవారం ధరలతో పోలిస్తే 200 రూపాయలవరకూ తగ్గింది. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆటగదరా శివా ఫేమ్ ఉదయ్ శంకర్ హీరోగా నటించిన 'మిస్ మ్యాచ్' ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరిగింది. మంత్రి హరీష్ రావు, అగ్ర నటుడు వెంకటేష్ లతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా ఎన్.వి.నిర్మల్ కుమార్ దర్శకత్వంలో జి.శ్రీరామ్ రాజు, భారత్ రామ్ లు ఈ సినిమాని నిర్మించారు. గిఫ్టన్ సంగీతం అందించిన ఈ సినిమా ఈ నెల 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యోదంతం కేసులో నలుగురు నిందితుల కస్టడీ కోరుతూ షాద్ నగర్ పోలీసులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు 10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో షాద్ నగర్ కోర్టులో నిన్న విచారణ జరిగింది. అనంతరం విచారణను కోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇస్రో చంద్రయాన్-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలం అతిసమీపంలోకి వెళ్లి కూలిన సంగతి తెలిసిందే. దీంతో దానీ జాడ కనిపెట్టలేక పోయాం. కానీ, తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) చంద్రుడిపై ఉన్న విక్రమ్ జాడను కనిపెట్టింది. దానికి సంబంధించిన ఫొటోని షేర్ చేసింది. సెప్టెంబర్ 26న ఏ ప్రదేశంలో పడిందో గుర్తించింది.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Show Full Article
Print Article
More On
Next Story
More Stories