నాసాను మించిపోయాడు.. విక్రమ్ ల్యాండ‌ర్‌ను గుర్తించింది ఇతడే !

నాసాను మించిపోయాడు.. విక్రమ్ ల్యాండ‌ర్‌ను గుర్తించింది ఇతడే !
x
షణ్ముగ సుబ్రమ‌ణియ‌న్
Highlights

షణ్ముగ సుబ్రమ‌ణియ‌న్‌. వృత్తి రీత్యా మెకానిక‌ల్ ఇంజినీర్‌. బ్లాగ‌ర్‌ యాప్ డెవ‌ల‌ప‌ర్‌. క్యూఏ ఇంజినీర్‌. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-2కు సంబంధించిన...

షణ్ముగ సుబ్రమ‌ణియ‌న్‌. వృత్తి రీత్యా మెకానిక‌ల్ ఇంజినీర్‌. బ్లాగ‌ర్‌ యాప్ డెవ‌ల‌ప‌ర్‌. క్యూఏ ఇంజినీర్‌. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-2కు సంబంధించిన విక్రమ్ ల్యాండ‌ర్‌ను కూడా గుర్తించింది ఇత‌నే. ఈ చెన్నై చిన్నోడే విక్రమ్ జాడ‌ను తొలిసారి గుర్తించిన‌ట్లు నాసా కూడా అత‌నికి క్రెడిట్ ఇచ్చింది. లూనార్ ఆర్బిటార్ తొలిసారి తీసిన ఫోటోల‌ను డౌన్‌లోడ్ చేసుకుని వాటిని ప‌రిశీలిస్తున్న స‌మ‌యంలో ఇంజినీర్ ష‌ణ్ముగ‌కు కొన్ని డౌట్స్ వ‌చ్చాయి. ఫోటోల్లో ఉన్న కొన్ని ప్రాంతాల‌ను గుర్తించి ఆవే విక్రమ్ కూలిన ప్రాంతాలేమో అని నాసాకు ట్వీట్ చేశారు. ఒక‌వేళ విక్రమ్ స‌క్రమంగా ల్యాండ్ అయి అది ఫోటోల‌ను పంపినా, చంద్రుడిపై ప్రతి ఒక్కరికీ ఇంత ఇంట్రెస్ట్ ఉండేది కాదేమో అని ష‌ణ్ముగ త‌న మెయిల్ ద్వారా నాసాకు త‌న అభిప్రాయాన్ని వినిపించాడు.

విక్రమ్ శిథిలాల‌ను భార‌తీయ ఇంజినీర్‌ ష‌ణ్ముగ సుబ్రమ‌ణియ‌న్ గుర్తించిన‌ట్లు నాసా చెప్పింది. విక్రమ్ వాయ‌వ్య ప్రాంతానికి 750 మీట‌ర్ల స‌మీపంలో విక్రమ్ శిథిలాలు క‌నిపించాయి. ఎల్ఆర్‌వో తీసిన చిత్రాల‌ను.. ష‌ణ్ముగ స్టడీ చేశారు. అయితే విక్రమ్ కూలిన ప్రాంతంలో మూడు పెద్ద పెద్ద శిథిలాల‌ను గుర్తించారు. ఫోటోల్లో ఆ శిథిలాల సైజు 2.2 పిక్సెల్స్‌గా ఉన్నాయి. విక్రమ్ ప‌డిన ప్రాంతానికి సంబంధించిన రెండు ఫోటోల‌ను నాసా అప్‌డేట్ చేసింది. విక్రమ్ కూల‌క‌ముందు, కూలిన త‌ర్వాత చంద్రుడి ఉప‌రిత‌లంపై జ‌రిగిన మార్పుల‌ను ఆ ఫోటోల్లో స్పష్టంగా కన్పిస్తున్నాయి.

చంద్రుడి ద‌క్షిణ ధృవానికి 600 కిలోమీట‌ర్ల దూరంలో విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సి ఉంది. కానీ దుర‌దృష్టవ‌శాత్తు ల్యాండ‌ర్‌తో ఇస్రో సంకేతాల‌ను కోల్పోయింది. అక్టోబ‌ర్ 14, 15, న‌వంబ‌ర్ 11 తేదీల్లో తీసిన ఫోటోల‌ను నాసా ఇమేజ్ సీక్వెన్స్ చేసింది. ఆ త‌ర్వాత న‌వంబ‌ర్‌లో తీసిన ఫోటోల‌తో బెస్ట్ పిక్సెల్ క్లారిటీ వ‌చ్చింది. దీంతో విక్రమ్‌ను గుర్తించిన‌ట్లు నాసా వెల్లడించింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories