Top
logo

బంగారం ధరలు తగ్గాయి.. స్థిరంగా వెండి ధరలు!

బంగారం ధరలు తగ్గాయి.. స్థిరంగా వెండి ధరలు!Today Gold rates Representational image
Highlights

నిన్న స్థిరంగా కదలాడిన బంగారం ధరలు ఈరోజు (03-12-2019) కిందకి దిగొచ్చాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.

నిన్న నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈరోజు దేశీయ మార్కెట్లలో తగ్గుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం స్థిరంగా మార్పులేకుండా నిలిచాయి. 03.12.2019 మంగళవారం పది గ్రాముల బంగారం ధర సోమవారం ధరలతో పోలిస్తే 200 రూపాయలవరకూ తగ్గింది. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి.

మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 2200 రూపాయలు తగ్గి 39,570 రూపాయలకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 190 రూపాయలు తగ్గి 36,270 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలు ఎటువంటి మార్పులకూ లోనవ్వలేదు. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 46,650 వద్ద స్థిరంగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,570 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,270 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు దిగివచ్చాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 150 రూపాయలు తగ్గింది. దీంతో 38,250 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 150 రూపాయలు తగ్గడంతో 37,050 రూపాయల వద్దకు చేరింది. ఇక వెండి ధర మాత్రం నిలకడగా కేజీకి 46,650 రూపాయల వద్ద నిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 03.12.2019 మంగళవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ, ఇటూ మారే అవకాశాలు ఉంటాయి.Web Titlegold-rates-today-03-12-2019-gold-rates-decreased-silver-rates-gold-rates-hyderabad-delhi-vijayawada
Next Story

లైవ్ టీవి


Share it