దిశ ఘటనకు నిరసనగా.. 3,200 కిలోమీటర్లు స్కూటర్‌పై ప్రయాణం

దిశ ఘటనకు నిరసనగా.. 3,200 కిలోమీటర్లు స్కూటర్‌పై ప్రయాణం
x
నీతూ చోప్రా
Highlights

హైదరాబాద్‌లో దిశ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారు.

హైదరాబాద్‌లో దిశ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. దీనిపై పలువురు ప్రముఖులు కూడా స్పందించారు. నిదింతులను ఉరి తీసినప్పుడే దిశకు న్యాయం జరుగుతుందని అభిప్రాయాలు తెలుపుతున్నారు. పార్లమెంట్ లోనూ దిశ హత్యచార ఘటనపై చర్చ నడిచింది. చట్టాల్లో మార్పులు తీసుకురావాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

ఈ నేపథ్యంలో దిశ ఉదంతంపై ఉదయ్‌పూర్‌కు చెందిన ఓ యువతి నీతూ చోప్రా స్పందించారు. 28ఏళ్ల నీతూ చోప్రా రాజస్తాన్‌ లోని బలోత్రా నుంచి కన్యాకుమారి వరకూ 3,200 కిలోమీటర్లు స్కూటర్ పై ప్రయాణం చేయనున్నట్లు తెలిపారు. దిశ హంతకులను ఉగ్రవాదులుగా ఆమె వర్ణించారు. హత్యాచార ఘటనలను కారణంగా చూపించి మహిళలను ఇంటకే పరిమితం చేయకుడని తెలిపింది. ఈ విషయమై ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ను కలిసి తన ప్రయాణం గురించి తెలియజేయనున్నారు.

ఆదివారం మంత్రి గజేంద్ర షెకావత్‌ను కలిశారు. ఆ‍యకు నీతూ చోప్రా తన ప్రణాళిక గురించి చెప్పారు. దిశ హంతకులను శిక్షించాలనేదే తన పోరాటం అని మంత్రికి చెప్పారు. ద్విచక్రవాహనంపై ఒంటరిగా కన్యాకుమారి వరకూ వెళ్తానని, నిందితులకు శిక్షపడే వరకూ ఓ సైనికురాలిగా పోరాటం చేస్తానని వెల్లడించారు. ఇందుకు కుటుంబ స‌భ్యులను ఒప్పించానని వారు కూడా అంగీకరించినట్లు నీతూ చోప్రా స్పష్టం చేశారు.

మరోవైపు ఢిల్లీకి చెందిన మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ స్వాతి మాలివాల్‌ కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. దేశంలో పలు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై స్వాతి మాలివాల్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై మంగళవారం నిరహారదీక్షకు దిగనున్నట్లు కూడా స్వాతి మాలివాల్‌ వెల్లడించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories