కొత్త తరహా సినిమా 'మిస్ మ్యాచ్'.. ప్రీ రిలీజ్ వేడుకలో మంత్రి టి.హరీష్ రావు

కొత్త తరహా సినిమా మిస్ మ్యాచ్.. ప్రీ రిలీజ్ వేడుకలో మంత్రి టి.హరీష్ రావు
x
Miss Match Movie Pre-release: మంత్రి టి.హరీష్‌రావు, వెంకటేష్‌, ఉదయ్‌శంకర్‌, ఐశ్వర్య రాజేష్‌
Highlights

ఆటగదరా శివా ఫేమ్ ఉదయ్ శంకర్ హీరోగా నటించిన 'మిస్ మ్యాచ్' ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరిగింది.

సినిమాల్లో కొత్త తరం హవా నడుస్తోంది. మిస్ మ్యాచ్ సినిమా కూడా ఆ తరహాలో వస్తున్న చిత్రమే. సినిమాల్లో సమాజం విలువలు పెంచేవిధంగా మంచి సందేశం ఉండాలి. మహిళల గౌరవం పెంచే విధంగా ఉండాలి. ఈ మిస్ మ్యాచ్ సినిమాలో అటువంటి మంచి అంశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఈ సినిమా విజయవంతం కావాలి అన్నారు తెలంగాణా రాష్ట్ర మంత్రి టి.హరీష్ రావు.

ఆటగదరా శివ ఫేమ్ ఉదయ్ శంకర్ హీరోగా నటించిన ''మిస్ మ్యాచ్'' సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో మంత్రి హరీష్ రావు సోమవారం పాల్గొన్నారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా ఎన్.వి.నిర్మల్ కుమార్ దర్శకత్వంలో జి.శ్రీరామ్ రాజు, భారత్ రామ్ లు ఈ సినిమాని నిర్మించారు. గిఫ్టన్ సంగీతం అందించిన ఈ సినిమా ఈ నెల 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.

ఇక ప్రీ రిలీజ్ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా జరిగింది. మంత్రి హరీష్ రావు, అగ్ర నటుడు వెంకటేష్ లతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిరువురు మిస్ మ్యాచ్ బిగ్ సీడీ ని విడుదల చేశారు.

దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ''ఉదయ్‌శంకర్‌ "ఆటగదరా శివ''తో శివుడి కటాక్షం పొందాడు. ఈ సినిమాతో మ్యాచ్‌ గెలుస్తాడనే అనుకుంటున్నా. ఐశ్వర్య రాజేష్‌ తల్లి నాగమణి 'అడవి రాముడు' నుంచి నాతో చాలా సినిమాలు చేసింది. 'కౌసల్య కృష్ణమూర్తితో సిక్సర్‌ కొట్టింది ఐశ్వర్య. ఈ సినిమాతో బాక్స్‌ బద్దలవుతుంది. మల్ల యోధురాలి పాత్రలో నటించిన ఐశ్వర్యలాంటి అమ్మాయిలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి చాలా అవసరం" అన్నారు.


సిరివెన్నెల సీతారామ శాస్త్రి మాట్లాడుతూ "నేను గురువుగా భావించే శ్రీరామ్‌ సర్‌ తనయుడు నటించిన సినిమా ఇది. ఈ వేడుకకి రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ చిత్ర కథ ప్రారంభం నుంచి తనతో ప్రయాణం చేయించారు నిర్మాత జి.వి.జి.రాజు. ఆయన నిర్మించిన 'తొలిప్రేమ'లో పాట రాశాను. ఇందులో రాయాల్సి ఉన్నా..పరిస్థితుల ప్రభావం వల్ల కుదరలేదు. అయినా ఈ చిత్రంలో నేను భాగం కావాలని 'తొలి ప్రేమ'లోనే రాసిన మనసే పాటని రీమిక్స్‌ చేయించారు. గిష్టన్‌ పరిశ్రమకి నిజంగా ఒక బహుమానం. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా" అన్నారు.

వెంకటేష్‌ మాట్లాడుతూ "ఇదొక అద్భుతమైన వేడుక. ఇందులో పని చేసిన ప్రతి ఒక్కరూ నా హృదయానికి దగ్గరైన వాళ్లు. ఉదయ్‌ తన తొలి సినిమాలో చాలా బాగా నటించాడు. 'మిన్‌ మ్యాచ్' లో మంచి పాత్రని సొంతం చేసుకున్నాడు. తన నిజ జీవితానికి చాలా దగ్గరైన పాత్రని చేశాడు. కొద్దిమంది మాత్రమే అలాంటి లక్ష్యాల్ని సాధిస్తారు. అది సాధారణ విషయం కాదు. తమిళంలో మంచి పాత్రలు చేసింది ఐశ్వర్య. ఇందులో సవాల్‌తో కూడుకున్న పాత్రని చేసింది. నిర్మల్‌ ప్రతిభగల దర్శకుడు. తను తీసిన 'డా.సలీమ్‌'లో నటించాలనుకున్నా. కానీ అనువాదమైంది. పేరుకి 'మిన్‌ మ్యాచ్‌ అయినా... చివరికి అందరికీ మ్యాచ్‌ అయ్యే సినిమా ఇది" అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎఫ్‌.డి.సి.ఛైర్మన్‌ రామ్‌మోహన్‌రావు, దేశపతి శ్రీనివాన్‌, చంద్రసిద్దార్డ్‌, భూపతిరాజా, శ్రీవిష్ణు, డాలీ, శ్రీరామ్‌, భద్రమ్‌, రూప, ధర్మతేజ, రాజేంద్రకుమార్‌, మధు, రేవంత్‌, శరణ్య, రావులపాటి వెంకట్‌, సంధ్య జనక్‌ తదితరులు పాల్గొన్నారు.

హత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన డా. దిశ మృతికి నివాళిగా నిమిషం పాటు మౌనం పాటించింది 'మిన్‌ మ్యాచ్‌ చిత్రబ్బందం.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories