ఈరోజు (మే-19-మంగళవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

నిన్నటి ముఖ్యాంశాలు:

* కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ భోగస్ : కేసీఆర్.....పూర్తి వివరాలు

* నియంత్రిత విధానంలో వ్యవసాయం చేస్తే రైతులకు లాభాలు : సీఎం కేసీఆర్ .....పూర్తి వివరాలు

* లాక్ డౌన్ 4.0 ఏపీలో ఇలా...పూర్తి వివరాలు

రోజు తాజా వార్తలు


Show Full Article

Live Updates

  • 19 May 2020 12:04 PM GMT

    ప్రతి జిల్లాకు ముగ్గురు జాయింట్ కలెక్టర్లు

    ప్రతి జిల్లాకు ముగ్గురు జాయింట్ కలెక్టర్లు నియామకం చేసినట్టు ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

    1. జె సి రెవిన్యూ ,రైతు భరోసా

    2.జె.సి గ్రామ వార్డ్ సచివాలయలు .వాలంటీర్ వ్యవస్థ

    3. జె.సి ఆసరా, వెల్ఫేర్ కార్యక్రమాలు..

    జగన్ ఇంకా ఎం చెప్పరంటే..

    - ఇసుక, మద్యం నియంత్రణ కై యువ ఐపీఎస్ అధికారులను నియమించాము..

    - వర్షాకాలం లోపు కావలసినంత ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు..

    - తాగునీరు ఎక్కడ దొరకలేదని మాట వినపడకూడదు అని సీఎం అన్నారు..

    - ఆగస్టు మూడో తేదీ నుంచి అన్ని జాగ్రత్తలతో స్కూల్స్ ప్రారంభించాలని సీఎం అన్నారు...

    - కరెంటు ఫిక్స్డ్ చార్జీలు తగ్గించాలని జీవో జారీ చేశాం..

    - జిల్లా పాలనా యంత్రాంగం పై ప్రతిరోజు రివ్యూ చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశం..

  • 19 May 2020 9:35 AM GMT

    ఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభం: సీఎం జగన్ మోహన్ రెడ్డి

    ఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభం: సీఎం జగన్ మోహన్ రెడ్డి

    జులై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు పూర్తిచేయాల్సి ఉంది

    9 రకాల సదుపాలను కల్పించాల్సి ఉంది.

    దీనికి సంబంధించి రూ.456 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ కూడా విడుదల చేశాం.

    జులై నెలాఖరు కల్లా అన్ని స్కూళ్లలో పనులు పూర్తి కావాలంటే.. కలెక్టర్లు ప్రతిరోజూ రివ్యూ చేయాలి.

    ఈ పనులకోసం సిమెంటు, ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలి.

  • 19 May 2020 9:35 AM GMT

    విశాఖ జిల్లా, అనకాపల్లిలో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు.

    విశాఖ జిల్లా, అనకాపల్లిలో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు.

    కుండ్రం & కుంచంగి జంక్షన్ లో ద్విచక్ర వాహనాలపై తరలిస్తున్న 105 లీటర్ల నాటు సారా స్వాధీనం.

    11 మందిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు.

    నాటు సారాతో పాటు 5 ద్విచక్ర వాహనాలు సీజ్.

  • 19 May 2020 8:37 AM GMT

    ఎల్జీ పాలిమర్స్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు

    సుప్రీం కోర్టులో ఎల్జీ పాలిమర్స్‌కు చుక్కెదురైంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలపై స్టే ఇవ్వడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

    ఎల్జీ పాలిమర్స్ ఘటనపై విచారణ జూన్ 8కి వాయిదా పడింది. ఎన్జీటీలో విచారణ తరువాతే సుప్రీం కోర్టులో విచారణ ఉంటుందని ధర్మాసనం తెలిపింది.

    ఎన్జీటీలో న్యాయపరమైన అంశాలు లేవనెత్తేందుకు అవకాశం కల్పించింది. సుమోటోగా విచారణ చేపట్టే అధికారం లేదని ఎల్జీ పాలిమర్స్ వాదనలు వినిపించగా.. ఆ విషయాలు అన్నీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎదుట ప్రస్తావించాలని ధర్మాసనం తెలిపింది.

    జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్, ఏపీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ.. సుప్రీం కోర్టులో ఎల్జీ పాలిమర్స్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

    విషవాయువు లీకేజీ ఘటనలో రూ.50 కోట్లు డిపాజిట్‌ చేయాలన్న తీర్పుపై ఈ పిటిషన్ దాఖలైంది. తమ వాదనలు వినకుండా ఏకపక్షంగా ఆదేశాలు ఇవ్వడాన్ని ఎల్జీ కంపెనీ సవాల్ చేసింది.



     


  • 19 May 2020 7:41 AM GMT

    మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం, కొత్త తండా పరిసర ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం పట్టివేత 

    పట్టుకున్న జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు.

    డీసీఎం వాహనంలో తరలిస్తున్న 45 క్వింటాళ్ల నల్లబెల్లం, 150 కిలోల పట్టిక, 40 లీటర్ల గుడుంబా స్వాధీనం.

    సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు.

  • 19 May 2020 7:31 AM GMT

    ఎల్జీ పాలిమర్స్ పరిధిలోని గ్రామాల్లో మంత్రి అవంతి పర్యటన

    విశాఖ జిల్లా గోపాలపట్నం ఎల్జీ పాలిమర్స్ పరిధిలో వెంకటాపురం, కంపరపాలెం గ్రామాల్లో పర్యటించిన మంత్రి అవంతి.

    లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ.

    ఐదు ప్రభావిత గ్రామాల ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ.

  • 19 May 2020 6:16 AM GMT

    గుంటూరు మిర్చి యార్డులో క్రయ విక్రయాలకు సన్నాహాలు

    గుంటూరు మిర్చి యార్డు క్రయ విక్రయాల పునః ప్రారంభ అంశంపై సమీక్ష నిర్వహించిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి కన్నబాబు.

    మార్కుఫెడ్ కార్యాలయం లో మంగళవారం సంబంధిత ఉన్నతాధికారులు, ట్రేడర్ లు, కమిషన్ ఏజెంట్స్ లతో ఆయన సమావేశం నిర్వహించారు.

    కరోనా వల్ల ముతబడ్డ ఈ మిర్చి యార్డు లో క్రయ విక్రయాలు ఆపేసిన సంగతి తెలిసిందే.

    అయితే ప్రస్తుత లాక్డౌన్ సడలింపు ల నేపథ్యంలో మిర్చి యార్డు లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ పరిమిత సిబ్బంది తో సామాజిక దూరాన్ని వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ క్రయ విక్రయాలకు అవకాశం వుండేలా ప్రయత్నాలు జరపాలని అధికారులు సూచించారు.

    ముందుగా  కొద్ది కొద్దిగా క్రయ విక్రయాలు చేస్తే బాగుంటుందని పలువురు సూచనలు చేశారు.

    గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాల్లో మార్కెట్ యార్డులో వికేంద్రీకరణ పద్దతిలో క్రయ విక్రయాలు కు తగిన చర్యలను తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 

  • 19 May 2020 6:09 AM GMT

    ఏపీలో గడిచిన గడిచిన 24 గంటల్లో 57 పాజిటివ్‌ కేసుల నిర్ధారణ.

    ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసులు 2339.

    ప్రత్యేక బులిటెన్ లో తెలిపిన ఏపీ ఆరోగ్య శాఖ

    -మరిన్ని వివరాలు 

  • 19 May 2020 5:33 AM GMT

    విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్త నిరసనలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు.

    ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు, నియోజకవర్గాల్లో నిరసనలు.

    ఇళ్లలోనే ఉంటూ దీక్షలు చేయాలని ఆదేశం.

  • 19 May 2020 5:31 AM GMT

    ఏపీ ప్రభాత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు 60 ఏళ్ల వృద్ధురాలిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

    ఈమేరకు వృద్దురాలికి  సీఐడీ అధికారులు నోటీసులు అందజేసినట్లు చెబుతున్నారు

    గుంటూరు జిల్లాకు చెందిన వృద్ధురాలు రంగనాయకమ్మ ఎల్ జీ పాలిమర్స్ ఘటనలో పోస్టు చేసినట్టు సమాచారం

    ఈ విషయంలో పూర్తివివరాలు అందాల్సి ఉంది.

Print Article
More On
Next Story
More Stories