ఏపీలో మరో 57 కరోనా పాజిటివ్ కేసులు

Arun Chilukuri
Published on: 19 May 2020 11:11 AM IST
ఏపీలో మరో 57 కరోనా పాజిటివ్ కేసులు
X

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2339 కి చేరాయి. గడిచిన 24గంటల్లో చిత్తూర్ మరియు కర్నూల్ లో ఒక్కొక్కరు మృతి చెందినట్టు హెల్త్ బులిటెన్ లో తెలిపారు.

ఏపీలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజా మరో 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM) 9739 మంది నమూనాలు పరీక్షించగా.. వారిలో 57 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ లో తెలిపింది. 69 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు. కోవిడ్ వల్ల చిత్తూర్ మరియు కర్నూల్ లో ఒక్కొక్కరు మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2339కి చేరాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story