నియంత్రిత విధానంలో వ్యవసాయం చేస్తే రైతులకు లాభాలు : సీఎం కేసీఆర్

నియంత్రిత విధానంలో వ్యవసాయం చేస్తే రైతులకు లాభాలు : సీఎం కేసీఆర్
x
KCR (File Photo)
Highlights

తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఅర్ ప్రకటించారు.

తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఅర్ ప్రకటించారు. ఈ మేరకు కేబినెట్‌ భేటీ అనంతరం ప్రగతి భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాతో కలిసి జీవించాల్సిందే అన్నారు.

వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తెస్తామన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. రైతులకు అనేక రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నామని, నియంత్రిత వ్యవసాయ విధానాన్ని పాటించడం వల్ల అనేక లాభాలుంటాయని చెప్పారు. తెలంగాణలో నాణ్యమైన పత్తిపంట పండుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతులు

ఏ పంటలు వేయాలి, ఎలా వేయాలో ప్రభుత్వం గైడ్ చేస్తుందన్నారు.

గత ఏడాది 1కోటి 23 లక్షల ఎకరాల పంట వచ్చిందని, 75లక్షల ఎకరాల్లో పత్తిపంట పండించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. 40 లక్షల ఎకరాల్లో వరి పంట పండించాలని నిర్ణయం, ఏ రకాల విత్తనాలు వేయాలో ప్రభుత్వం సుచిస్తుంది. 15లక్షల కంది పంట వేయాలని నిర్ణయం.మిర్చి, పసుపు, సోయాబీన్, కూరగాయలను కొన్ని కొన్ని ప్రాంతాల్లో తక్కువ మొత్తంలో లక్షల ఎకరాల్లో వేసుకోవచ్చని కేసీఆర్ వెల్లడించారు.

మక్కకు బదులు కందిపంట వేయాలని రైతులకు సూచించిన కేసీఆర్. ప్రభుత్వం చెప్పిన పంట వేయకపోతే రైతు బంధు రాదని చెప్పరు. కలెక్టర్ల మధ్య పోటీ లాగా పని చేసి రైతులకు ప్రభుత్వ విజన్ అర్ధం చేయించాలి సూచించారు. తెలంగాణ సోనా అనే కొత్త విత్తనాన్ని తెలంగాణ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిలో షుగర్ స్థాయి తక్కువ ఉంటుందని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారని కేసీఆర్ అన్నారు.

జిల్లా రైతు బంధు అధ్యక్షులు, వ్యవసాయ శాఖ అధికారులతో రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ లో సమావేశం నిర్వహించనున్న కేసీఆర్...అభ్యుదయ వ్యవసాయక రాష్ట్రంగా తెలంగాణాని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. రైతుల తలరాత రైతులే రాసుకోవాలి, రెండు మూడు రోజుల్లో రైతులతో ముఖాముఖి పెట్టి మాట్లాడుతానని, శాస్త్రీయ దృక్పథంతో ముందుకు వెళ్దాంమని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories