ఈరోజు (మే-19-మంగళవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

నిన్నటి ముఖ్యాంశాలు:

* కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ భోగస్ : కేసీఆర్.....పూర్తి వివరాలు

* నియంత్రిత విధానంలో వ్యవసాయం చేస్తే రైతులకు లాభాలు : సీఎం కేసీఆర్ .....పూర్తి వివరాలు

* లాక్ డౌన్ 4.0 ఏపీలో ఇలా...పూర్తి వివరాలు

రోజు తాజా వార్తలు


Show Full Article

Live Updates

  • 19 May 2020 4:49 AM GMT

    కరెంటు బిల్లుల అంశం ఏపీలో ఆందోళనలకు దారి తీసింది.

    విపక్షాలు ప్రభుత్వం పై మండిపడుతున్నాయి. నిన్న వామపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి

    ఈరోజు  పెరిగిన కరెంటు బిల్లులు తగ్గించాలంటూ నెల్లూరు టీడీపీ నేత, నూడా మాజీ చైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఒక్కరోజు దీక్ష చేపట్టారు.

    మూడు నెలలుగా పనుల్లేక అల్లాడుతున్న ప్రజలపై ఇటువంటి భారం మోపడం అన్యాయమని ఆయన అన్నారు.

  • 19 May 2020 3:49 AM GMT

    వెబ్సైట్ లో ఏపీ పదోతరగతి నమూనా ప్రశ్నా పత్రాలు

    ఆంధ్ర ప్రదేశ్ పదోతరగతి పరీక్షలు కరోనా తొ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మిగిలిన పరీక్షలు నిర్వహించడం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం పరీక్షల విధానంలో స్వల్ప మార్పులు చేసింది. ఇంతకు ముందు ఒక్కో సబ్జెక్టు లోనూ రెండు పరీక్షలు నిర్వహించేవారు. ఈసారి అలాకాకుండా ఒకే పరీక్ష నిర్వహించేలా మార్పులు చేశారు. దీంతో పరీక్షా పత్రం ఎలా ఉంటుందో అని విద్యార్థులకు అనుమానాలు ఉండేవి. వాటిని తీర్చడం కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 

    - వెబ్ సైట్ లో  ఆంధ్రప్రదేశ్ పదో తరగతి నమూనా పత్రాలు

    - పేపరు మార్పులకు అనుగుణంగా రూపొందించిన ప్రశ్నాపత్రాలను దీనిలో చూడవచ్చు.

    - www.bseap.org వెబ్ సైట్ నుంచి ఈ మోడల్ పేపర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.



     



  • 19 May 2020 3:38 AM GMT

    - వాహనమిత్ర రెండో విడత దరఖాస్తులు స్వీకరణ

    - ఈ నెల 28 వరకు దరఖాస్తులు స్వీకరణ

    - ఆధార్, రేషన్ కార్డు, వాహనం ఆర్సీ బుక్, డ్రైవింగ్ లైసెన్సు, బ్యాంక్ పాస్ బుక్, కుల దృవపత్రంలు దరఖాస్తుకు జతచేయాలి

    - దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయాలి.

  • 19 May 2020 3:35 AM GMT

    - ఏయూ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల

    - జులై మొదటి వారం నుంచి డిగ్రీ, పీజీ పరీక్షలు నిర్వహణ

    - ఈ నెల 25న ఇంజనీరింగ్ చివరి సంవత్సరం పరీక్షా ఫలితాలు విడుదల

    - ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి

  • 19 May 2020 3:34 AM GMT

    ఆన్ లైన్ లో వేంకటేశునికి కానుకల వెల్లువ!

    కరోనా మహమ్మారి ఎంతలా భయపెడుతున్నా..తిరుమల శ్రీవారికి ఆన్ లైన్ లో విరాళాల వెల్లువ తగ్గలేదు. 

    వేంకటేశ్వరుడి దర్శన భాగ్యానికి భక్తులు నోచుకోకపోతున్నా కానుకలు సమర్పించడంలో మాత్రం భక్తులు పోటీపడుతూనే ఉన్నారు. 

    ఆన్‌లైన్ ద్వారా, గోవిందం యాప్ ద్వారా తోచినంతగా తిరుమలేశుని హుండీకి కానుకలు సమర్పించుకుంటున్నారు.

    గత ఏడాది ఇలా ఆన్ లైన్ ద్వారా 90 లక్షల కానుకలు జమ కాగా, ఈ సంవత్సరం కూడా అంతే మొత్తంలో కానుకలు సమర్పించారు భక్తులు 

    కరోనా సంక్షోభంలోనూ అంతే మొత్తంలో ఆన్‌లైన్ హుండీ ఆదాయం రావడం విశేషంగా చెబుతున్న టీటీడీ అధికారులు 



     



  • 19 May 2020 3:25 AM GMT

    విదేశాల నుంచి విశాఖ రానున్న భారతీయులు

    - కరోనా కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి రప్పిస్తున్న విషయం తెలిసిందే.

    - ఈ క్రమంలో ఈరోజు  320 మంది  ప్రయాణికులు విశాఖ రాక

    - మనీలా నుంచి 170, అబుదాబీ నుంచి 150 ప్రయాణికులు రానున్నారు.

    - మనీలా నుంచి రాత్రి 8.30, అబుదాబీ నుంచి రాత్రి 8.45కు ఈ విమానాలు రానున్నాయి.

  • 19 May 2020 3:21 AM GMT

    నేడు సుప్రీంకోర్టులో ఎల్ జీ పాలిమర్స్ కేసు విచారణ

    - విశాఖపట్నం గ్యాస్ ప్రమాదం ఘటనపై సుప్రీం కోర్టుకెక్కిన ఎల్జీ పాలిమర్స్

    - తనపై ఏపీ హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎల్ జీ పాలిమర్స్

    - ఎల్జీ పాలిమర్స్ అభ్యర్ధనపై నేడు విచారణ జరపనున్న సుప్రీం కోర్టు 

  • 19 May 2020 3:00 AM GMT

    ఏపీకి తప్పిన ఆంఫన్ తుపాను ముప్పు!

    కొద్దిరోజులుగా భయానికి గురిచేస్తున్న పెనుతుపాను ముప్పు ఆంధ్రప్రదేశ్ కు తప్పినట్టే అని అధికారులు చెబుతున్నారు. రకరకాలుగా దిశను మార్చుకున్న ఈ తుపాను ఇప్పుడు పారాదీప్ కు 770 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 

    ఇది తన దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యం వైపు పయనిస్తోంది.

    రేపు తీరం దాటే అవకాశం ..దీంతో  ఏపీకి తప్పిన ముప్పు

  • 19 May 2020 2:56 AM GMT

    ప్రయాణీకుల కోసం బస్సుల ఎదురుచూపు

    తెలంగాణాలో ఎట్టకేలకు 56 రోజులకు రోడెక్కిన ఆర్టీసి బస్సులు,

    - అన్ని డిపోల నుండి పూర్తి సానిటేషన్ తో బైటకు వచ్చిన బస్సులు.

    - చాలా డిపోలలో బస్సులకు ప్రయాణీకుల కరువు 

    - ప్రయాణికులు కోసం వేచిచూస్తూ బస్టాండులోనే నిలిపిన సిబ్బంది.



     


     


  • 19 May 2020 2:51 AM GMT

    విశాఖ మన్యంలో మళ్ళీ చెలరేగుతున్న 'మలేరియా'

    విశాఖ మన్యంలో మరోసారి మరణ మృదంగం మోగుతోంది... మలేరియా బారిన పడి మరణాలు సంభవిస్తున్నాయి. రెండు, మూడేళ్లతో పోలిస్తే ఇవి దాదాపుగా రెట్టింపయ్యాయి.

    - ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు చూస్తే 447 మంది మలేరియాతో మరణించారు.

    - వాస్తవంగా నాలుగైదు ఏళ్లకు ఒకసారి మలేరియా తీవ్రత ఎక్కువగా ఉంటుందని, 2016లో ఇదే సమయానికి 900కు పైగా మరణాలు సంభవించాయని, అదే మాదిరిగా ఈ ఏడాది మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని అధికాయి అంచనా వేస్తున్నారు.

    - మరిన్ని వివరాలు 

Print Article
More On
Next Story
More Stories