Zelenskyy: ఇలాగే కొనసాగితే.. మూడో ప్రపంచ యుద్ధమే

Zelensky warns Ukraine conflict will turn into World War 3 if Russia not contained
x

Zelenskyy: ఇలాగే కొనసాగితే.. మూడో ప్రపంచ యుద్ధమే

Highlights

Zelenskyy: మద్దుతు కూడగట్టే పనిలో ప్రస్తుతం జర్మనీలో పర్యటిస్తున్న జెలెన్‌స్కీ

Zelenskyy: రష్యాతో జరుగుతున్న ఘర్షణ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించారు. అమెరికా సహా అనేక దేశాలు తమకు మద్దతుగా నిలుస్తున్న నేపథ్యంలో ఏమైనా జరగొచ్చని వ్యాఖ్యానించారు. ఈ విషయం జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌కు కూడా తెలుసని పేర్కొన్నారు. ఒకవేళ నాటో కూటమిలోని సభ్య దేశంపై రష్యా దాడి చేస్తే.. అది మరో ప్రపంచ యుద్ధానికి నాందిగానే భావించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్న జెలెన్‌స్కీ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బెర్లిన్‌ నుంచి టారస్‌ క్రూజ్‌ క్షిపణలు అందకపోవటంపై తాను పెద్దగా నిరాశ చెందలేదని జెలెన్‌స్కీ అన్నారు. రష్యాతో యుద్ధం విషయంలో ఐరోపా దేశాలకు ఉన్న బలహీనతలను అర్థం చేసుకోగలనన్నారు. ఉక్రెయిన్ ఆక్రమణకు రష్యా సిద్ధమైన సమయంలో జర్మనీ తన వంతు పాత్ర పోషించలేదని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌ కోసం ఇతర ఐరోపా దేశాలతో కలిసి ఇప్పుడు అది పెద్ద ఎత్తున నిధులను సమీకరించే ప్రయత్నం చేయాలని జెలెన్‌స్కీ కోరారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధిస్తే ఉక్రెయిన్‌కు మద్దతిస్తారా అని ప్రశ్నించగా.. అగ్రరాజ్య విదేశాంగ విధానం ఒక వ్యక్తిపై ఆధారపడి ఉండదని వివరించారు. మరోవైపు ఉక్రెయిన్‌కు అమెరికా ఆర్థిక సాయం తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాతో పోరాటం కొనసాగుతున్న సమయంలో ఇలాంటి చర్యలు ప్రతికూల సంకేతాలు పంపుతాయని జెలెన్‌స్కీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories