Coronavirus: వుహాన్‌లో నో మాస్క్..!

చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచం అంతట విజృంభించింది. మొదట్లో చైనాలో అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి.

admin1
Updated on: 16 March 2020 12:14 PM IST
Coronavirus: వుహాన్‌లో నో మాస్క్..!
X
Wuhan doctors (File Photo)

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్.. చైనాలో తగ్గు ముఖం పట్టింది. మిగతా దేశాలకు విస్తరించిన ఈ మహమ్మరి.. వుహాన్ లో మాత్రం పరిస్థితి అదుపులోకి వచ్చింది. దీంతో చైనాలో వైద్యులు ఆనందంతో డ్యాన్స్‌ చేస్తూ.. సంతోషాన్ని వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హాస్పిటల్ లో వైద్యులు ముఖానికి ఉన్న మాస్క్‌లు తీసి.. డ్యాన్సులు చేశారు.

చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచం అంతట విజృంభించింది. మొదట్లో చైనాలో అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత కరోనా ఇతర దేశాలకు విస్తరించింది. ఇతర దేశాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుంటే.. చైనా మాత్రం క్రమంగా తగ్గుతున్నారు. దీంతో చైనా వైద్యులు ఆనందంతో డ్యాన్స్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అయ్యింది.

admin1

admin1

Next Story