Top
logo

World's Most Expensive Face mask: ఇప్పుడు మాస్క్‌ ఓ స్టేట‌స్ సింబల్!

World
X
World's most expensive coronavirus mask costs over ₹11 crore
Highlights

World's Most Expensive Face mask: కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నో రకాల మాస్కులు మార్కెట్ అందుబాటులోకి ఉన్నాయి .

World's Most Expensive Face mask: కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నో రకాల మాస్కులు మార్కెట్ అందుబాటులోకి ఉన్నాయి . సాధారణ కాటన్ మాస్క్ నుంచి కొంచెం ఖరీదైన ఎన్90 మాస్క్ లు ధరించడం సర్వసాధారణంగా మారిపోయింది. కానీ, ధనవంతులు మాస్కుల విషయంలోనూ కాస్త వెరైటీగా ఆలోచిస్తున్నారు. మాస్క్ అనేది సంర‌క్ష‌ణ‌కు మాత్ర‌మే కాదు. ఓ స్టేట‌స్ సింబల్ గా భావిస్తున్నారు.

త‌దనుగుణంగా.. తమ స్థాయి, అంత‌స్థు, హోదాను ప్ర‌తిబింబించేలా.. త‌మ అభిరుచుల‌కు న‌చ్చేలా.. అత్యంత ఖ‌రీదైన మాస్కుల‌ను ఆర్డ‌ర్ల పై తయారు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అతి ఖరీదైన మాస్క్ రూపుదిద్దుకుంటోంది. ఇజ్రాయెల్ ఆభరణాల సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ కరోనావైరస్ మాస్క్ ను తయారు చేస్తోంది.

వివ‌రాల్లొకెళ్తే.. అమెరికాలో నివసిస్తున్న ఓ చైనా వ్యాపారవేత్త త‌న హోదాకు అనుగుణంగా.. ప్రపంచంలోనే అతి ఖరీదైన మాస్కును ధరించాలని భావించి, అందుకోసం జెరూసలేంలో ఓ ఆభరణాల సంస్థలో ఆర్డర్ చేశారు. టాప్ రేటెడ్ ఎన్ 99 ఫిల్టర్లు, పసిడి, వజ్రాలు పొదిగిన మాస్క్ ను తయారు చేయాలని కోరారు. దీని ఖ‌రీదు సుమారు 11.2 కోట్ల రూపాయలని జ్యూవెల‌రీ సంస్థ తెలిపింది. ఈ మాస్క్ ను 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో దీన్ని తయారు చేస్తున్నామని, మాస్కు చుట్టూ 3,600 తెలుపు, నలుపు వజ్రాలతో అలంకరించనున్నామని వివరించారు.

Web TitleWorld's most expensive coronavirus mask costs over ₹11 crore
Next Story