ప్రపంచ వ్యాప్తంగా ఆగని కరోనా కేసులు.. !

ప్రపంచ వ్యాప్తంగా ఆగని కరోనా కేసులు.. !
x
Highlights

చైనాలో మొదలైన కరోనా వైరస్ 195 దేశాలకి పైగా విస్తరించి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ బారిన పడి చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారు....

చైనాలో మొదలైన కరోనా వైరస్ 195 దేశాలకి పైగా విస్తరించి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ బారిన పడి చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారు. మరికొందరు ఈ వ్యాధితో పోరాడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 44 లక్షల 27 వేల 900కి చేరింది. ఇందులో ఇప్పటికే 2.98 లక్షల మంది చనిపోగా, 16.57 లక్షల మంది కొలుకున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 85 వేల కేసులు నమోదు అయ్యాయి.

ఇక అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. అక్కడ తాజా కేసుల సంఖ్య 14 లక్షల ముప్పై వెలకి చేరుకుంది. మరణాల సంఖ్య 85 వేలకి చేరింది. ఇక అమెరికా తరవాత స్పెయిన్, రష్యా, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, టర్కీ, ఇరాన్‌, చైనా-, కెనడా, బెల్జియం దేశాలు ఉన్నాయి. స్పెయిన్‌ లో 26920మంది చనిపోతే, యూకేలో 32,692, ఇటలీలో 30,911, ఫ్రాన్స్‌ లో 26991 ,బ్రెజిల్ లో 12404, జర్మనీలో 7738, రష్యాలో 2116, ఇరాన్‌ లో 6733, చైనాలో 4633, టర్కీలో 3894, బెల్జీయంలో 8781, నెదర్లాండ్స్‌ లో 5510, కెనడాలో 5169, మెక్సికోలో 3926 మంది చనిపోయారు.

ఇక భారత్ విషయానికి వస్తే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముడొదశ లాక్ డౌన్ నడుస్తున్నప్పటికీ కరోనా కేసులు మాత్రం ఎక్కడ కూడా తగ్గుముఖం పట్టడం లేదు.. మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్ , తమిళనాడు , గుజరాత్ రాష్ట్రాలలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. అక్కడ కరోనా కేసుల సంఖ్య 25 వేల మార్క్ దాటగా, మరణాల సంఖ్య 1000కి చేరువైంది.

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,525 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య 78,055 కి చేరుకుంది. ఇక కరోనాతో పోరాడి 2,551మంది చనిపోయారు. . దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు సడలించడం, భారీ సంఖ్యలో వలస కార్మికులు వారి స్వస్థలాలకు తరలి వెళుతుండడంతో పలు రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత ఎక్కువైంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories