Volodymyr Zelenskyy: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు జెలన్‌ స్కీ ఫోన్

Volodymyr Zelenskyy: *ఉక్రెయిన్ భద్రత, ఆర్థిక సాయంపై చర్చ *రష్యాపై ఆంక్షల కొనసాగింపుపై చర్చించిన నేతలు

Rama Rao
Published on: 6 March 2022 11:01 AM IST
Volodymyr Zelenskyy Phone to US President Joe Biden | Telugu News Today
X

 అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు జెలన్‌ స్కీ ఫోన్

Volodymyr Zelenskyy: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతోంది. పుతిన్ ఆదేశాల‌తో మ‌రింత దూకుడుగా ముందుకుసాగుతూ.. విధ్వంసం సృష్టిస్తున్నాయి రష్యా మిలటరీ దళాలు. ర‌ష్యా మ‌రింత దూకుడుగా ప్రద‌ర్శిస్తుండ‌టంతో ప్రపంచదేశాలు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే శాంతియుతంగా ఈ వివాదాన్ని ప‌రిష్కరించుకోవాలని చాలా దేశాలు కోరుతున్నాయి.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ఫోన్ చేశారు. ఉక్రెయిన్ భద్రత, ఆర్థిక సహకారం, రష్యాపై ఆంక్షల కొనసాగింపు లాంటి కీలక అంశాలపై చర్చించారు. ఇప్పటికే కొనసాగుతున్న చర్చల్లో భాగంగా మరోసారి అమెరికా ప్రెసిడెంట్‌తో మాట్లాడానని జెలన్ స్కీ తెలిపారు. ఉక్రెయిన్‌ను కాపాడుకోవడం రష్యాను కంట్రోల్ చేయడంపైనే ఎక్కువగా దృష్టిపెట్టామని జెలన్ స్కీ తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story