Vladimir Putin: రష్యా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్

Vladimir Putin: మళ్లీ పుతిన్‌కే పట్టం కట్టిన రష్యన్లు

Jyothi
Published on: 18 March 2024 8:57 AM IST
Vladimir Putin wins Russian Presidential Elections
X

Vladimir Putin: రష్యా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్

Vladimir Putin: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ఎన్నికయ్యారు. మూడు రోజులపాటు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఆయన 87.97 శాతం ఓట్లతో విజయం సాధించారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావిత ప్రాంతంలో ఆన్‌లైన్‌ ఓటింగ్‌కు అవకాశం కల్పించారు. 60 శాతానికి మించి పోలింగ్ శాతం నమోదయింది. పుతిన్‌పై మూడు స్నేహపూర్వక పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీకి దిగారు. అత్యంత కఠినమైన ఆంక్షల మధ్య ఈ ఎన్నికలు జరిగాయి. ఉక్రెయిన్‌ యుద్ధం, పుతిన్‌పై బహిరంగ విమర్శలు చేయకుండా ఆంక్షలు విధించారు. పుతిన్‌కు రాజకీయ శత్రువైన అలెక్సీ నావల్నీ గత నెలలో చనిపోయిన నేపథ్యంలో ఎన్నికలు జరిగాయి. ఇక పుతిన్‌ను విమర్శించిన వారిలో చాలా మంది జైలులో ఉండగా.. కొందరు విదేశాల్లో తలదాచుకుంటున్నారు.

Jyothi

Jyothi

Next Story