ఆస్కార్ వేడుకలకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ!

Volodymyr Zelenskyy: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్న జెలెన్‌స్కీ తన వాణిని వినిపించేందుకు ఆస్కార్‌ను వేదికగా చేసుకోవాలని చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Arun Chilukuri
Published on: 26 March 2022 2:40 PM IST
Ukraine President Zelensky to Appear at the Oscars
X

ఆస్కార్ వేడుకలకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ!

Volodymyr Zelenskyy: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్న జెలెన్‌స్కీ తన వాణిని వినిపించేందుకు ఆస్కార్‌ను వేదికగా చేసుకోవాలని చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆదివారం లాస్‌ఎంజెల్స్‌లో జరిగే ఆస్కార్‌ ఉత్సవాల్లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ మాట్లాడుతారనే ప్రచారం జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారంలో కాని, రికార్డెడ్ వీడియో రూపంలోనైనా జెలెన్‌స్కీ మాట్లాడేందుకు గాను ఆస్కార్ నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే జెలెన్‌స్కీ ప్రసంగంపై ఆస్కార్ నిర్వాహకులు ఎలాంటి ప్రకటన చేయలేదు. స్వతహాగా నటుడైన జెలెన్‌స్కీ ఆస్కార్ వేదికగా ఉక్రెయిన్ కష్టాలను ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story