Asia's Richest Woman : యంగ్ చైనా బిలియనీర్‌కు కష్టాలు

Asia's Richest Woman : భారీగా సంపదను కోల్పోయిన యాంగ్‌ హుయియాన్

Sriveni Erugu
Published on: 29 July 2022 8:19 AM IST
Troubles for Young Chinese Billionaire
X

Asia's Richest Woman : యంగ్ చైనా బిలియనీర్‌కు కష్టాలు

Asia's Richest Woman : ఆసియాలోనే అత్యంత ధనవంతురాలైన మహిళగా గుర్తింపు పొందిన యాంగ్ హుయాన్ గత ఏడాది కాలంలో తన సగం సంపదను కోల్పోయింది. చైనా రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావడంతో ఆమె సంపద కరిగిపోయినట్లు బిలియనీర్ ఇండెక్స్ తెలిపింది. కంట్రీ గార్డెన్ ప్రాపర్టీలో ఇటీవల షేర్లు దారుణంగా పడిపోయాయి. సుమారు 52 శాతం ఆ కంపెనీ షేర్లు డౌన్ అయ్యాయి. గడిచిన ఏడాది 23.7 బిలియన్ల డాలర్లు ఉన్న ఆ కంపెనీ సంపద 11.3 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. చైనాలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ సంక్షోభం నడుస్తోంది. దీంతో యాంగ్ ఒక్క ఏడాదిలోనే సుమారు 12 బిలియన్ల డాలర్ల సంపదను కోల్పోవాల్సి వచ్చింది. 2020లో చైనా ప్రభుత్వం రియల్ ప్రాపర్టీ రంగంపై కొరడా ఝుళిపించింది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story