Terrorist Attack: పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల బీభత్సం

* పాక్ సైనికులే లక్ష్యంగా ఐఈడీ పేలుళ్లు * 8మంది మృతి, పలువురికి గాయాలు * మృతుల్లో నలుగురు చైనా ఇంజినీర్లు

Sandeep Reddy
Published on: 14 July 2021 6:32 PM IST
Terrorist Attack On Running Bus in Pakistan
X

బస్సులో పేలుళ్లు (ఫైల్ ఫోటో)

Terrorist Attack: ఉత్తర పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు.. చైనా ఇంజనీర్లు, పాకిస్తాన్ సైనికులతో వెళ్తున్న బస్సు లక్ష్యంగా పేలుళ్లకు పాల్పడ్డారు. ఈఘటనలో నలుగురు చైనా ఇంజనీర్లు సహా ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దాసు ఆనకట్ట నిర్మాణ పనుల కోసం ఇంజనీర్లు, కార్మికులు కలిసి 30 మంది బస్సులో వెళ్తుండగా ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ పేలుళ్ల ధాటికి బస్సు లోతైన లోయలో పడింది. ఈఘటనలో ఎనిమిది చనిపోయారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story