SCO Summit: పాక్‌ ప్రధాని అవస్థలు.. పుతిన్‌ ముసి ముసి నవ్వులు..

SCO Summit: SCO సమ్మిట్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ భేటీ నవ్వులు పూయించింది.

Arun Chilukuri
Published on: 16 Sept 2022 12:35 PM IST
SCO Summit Pak PM Shehbaz Sharif Struggles With Earphone
X

SCO Summit: పాక్‌ ప్రధాని అవస్థలు.. పుతిన్‌ ముసి ముసి నవ్వులు..

SCO Summit: SCO సమ్మిట్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ భేటీ నవ్వులు పూయించింది. షరీఫ్‌ అవస్థలు చూసి పుతిన్‌ కూడా ముసి ముసిగా నవ్వుకున్నాడు. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌ఖండ్‌లో సమావేశమైన ఇద్దరి నేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. చర్చలకు ముందే పుతిన్‌ ఇయర్‌ ఫోన్స్‌ చెవిలో పెట్టుకున్నారు. అయితే షహబాజ్‌ ఇయర్‌ ఫోన్‌ పెట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు.

ఇదంతా చూసిన పుతిన్‌ ఎవరైనా హెల్ప్‌ చేయండని సిబ్బందిని పిలిచారు సహాయకుడు వచ్చి ఇయర్‌ ఫోన్‌ పెట్టి వెళ్లిపోయాడు. కాసేపటికే మళ్లీ ఊడిపోయింది. సహాయకుడు వచ్చి మళ్లీ అమర్చి వెళ్లాడు ఈ సీన్‌ మొత్తాన్ని చూస్తున్న పుతిన్‌ నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. షరీఫ్‌ అంతర్జాతీయంగా పాకిస్థన్‌ పరువు తీశాడని పాక్‌ ప్రతిపక్షనేతలు ట్వీట్‌ చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story