Russia-Ukraine War: యుద్ధాన్ని తీవ్రం చేసిన రష్యా

Russia-Ukraine War: ఉక్రెయిన్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన

Rama Rao
Updated on: 26 Feb 2022 12:15 PM IST
Russia Intensified the War | Telugu Online News
X

యుద్ధాన్ని తీవ్రం చేసిన రష్యా

Russia-Ukraine War: కీవ్‌పై కన్నేసిన రష్యాకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఉక్రెయిన్ రాజధాని సరిహద్దుల్లోకి ప్రవేశించిన రష్యా దళాలకు స్థానిక ఆర్మీ ముచ్చెమటలు పట్టిస్తోంది. దీంతో రష్యా భీకర దాడులు చేస్తోంది. తమ ఆర్మీ ధీటుగా బదులు ఇస్తోందని ఉక్రెయిన్ మిలిటరీ తెలిపింది. సిటీలోని ఓ ప్రధాన వీధి వద్ద రష్యా బలగాలను తమ ఆర్మీ యూనిట్ వెనక్కి వెళ్లేలా చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం పేర్కోంది.

వీధుల్లో భీకర స్థాయిలో పోరాటం జరుగుతోందని ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని కీవ్ నగర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వాసిల్కీవ్ ప్రాంతంలో హోరాహోరీ పోరు సాగుతున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. పలు రష్యా టార్గెట్‌లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ దళాలు పేర్కొన్నాయి. వాలిస్కీన్ ఎయిర్‌బేస్‌పై రష్యా పారాట్రూపర్లు దాడి చేశారు. వారిని ఉక్రెయిన్ ఆర్మీ కమాండోలు ధీటుగా తిప్పికొట్టారు. రష్యాకు చెందిన ట్రాన్స్‌పోర్ట్ విమానాన్ని కూడా పేల్చివేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది.

Rama Rao

Rama Rao

Next Story