రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో 50 నిమిషాలు ఫోన్‌లో మాట్లాడిన మోడీ

Narendra Modi: ప్రధాని మోడీకి తాజా వివరాలు వెల్లడించిన రష్యా అధ్యక్షుడు పుతిన్

Rama Rao
Published on: 7 March 2022 5:03 PM IST
PM Narendra Modi Spoke on the Phone with Russian President Putin
X

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో 50 నిమిషాలు ఫోన్‌లో మాట్లాడిన మోడీ

Narendra Modi: తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో, ప్రధాని నరేంద్ర మోడీ 50 నిమిషాల పాటు చర్చించారు. ఇంకా ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయుల తరలింపునకు సహకరించాలన్నారు. అదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడితోనూ నేరుగా చర్చలు జరపాలంటూ పుతిన్‌ను మోడీ విజ్ఞప్తి చేశారు. అలా చేయడం ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ ప్రకటించి భారతీయుల తరలింపునకు సహకరిస్తున్నందుకు రష్యాకు మోడీ ధన్యవాదాలు తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story