Viral News: ఆక్స్ఫర్డ్‌లో చదివాడు.. చివరకు డెలివరీ బాయ్ అయ్యాడు..!

Viral News: ప్రపంచవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. మన దేశంలోనే కాదు చాలా దేశాల్లోని యువత పెద్ద పెద్ద డిగ్రీలు చదివినా..ఉద్యోగాలు లేక.. రాక ఇబ్బందులు పడుతున్నారు.

Indira Ram
Published on: 7 July 2025 11:38 AM IST
PhD, Oxford Graduate Turns Food Delivery Worker in China
X

Viral News: ఆక్స్ఫర్డ్‌లో చదివాడు.. చివరకు డెలివరీ బాయ్ అయ్యాడు..!

Viral News: ప్రపంచవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. మన దేశంలోనే కాదు చాలా దేశాల్లోని యువత పెద్ద పెద్ద డిగ్రీలు చదివినా..ఉద్యోగాలు లేక.. రాక ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా చైనాకు చెందిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయంది. ఇంతకీ ఈపోస్ట్‌లో ఏముందో మీరే తెలుసుకోండి.

‘ఆక్స్‌ ఫర్డ్‌లో చదివి చివరకు నేను డెలివరీ బాయ్‌ని అయ్యాను..’ అని చైనాకు చెందిన యువకుడు డింగ్ యోన్‌జావో(39) సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే ఎంతోమంది వరల్డ్‌ టాప్‌లో ఉన్న యూనవర్శిటీలో ఒకటైన ఆక్సఫర్డ్‌లో చదవాలని కలలు కంటారు. అటువంటిది అందులో చదవి కూడా అతనికి ఉద్యోగం రాలేదా? ఇప్పుడు డెలివరీ బాయ్‌గా ఉద్యోగం చేస్తున్నాడా? వివరాలు చూద్దాం.

చైనాకు చెందిన డింగ్ యోన్ జావో ప్రముఖ యూనివర్శిటీల్లో పీజీ , పీహెచ్‌డీలలో డిగ్రీ పట్టాలు అందుకున్నాడు. ఇందులో చైనాలోని బీజింగ్ సింఘువా యూనిర్శిటీ నుంచి కెమిస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ పట్టా, నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్శిటీ నుంచి బయోలజీలో పీహెచ్‌డీ, పెకింగ్ యూనివర్శిటీ నుంచి ఎనర్జీ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. పీహెచ్‌డీ పూర్తి చేసిన తర్వాత డింగ్ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ నుంచి బయోలజీలోనే మరో డిగ్రీ కూడా పూర్తి చేశాడు. ఆ తర్వాత సింగ్ పూర్‌‌ నేషనల్ యూనివర్శిటీలో పోస్ట్ డాక్టోరల్ పరిశోధకుడిగా పనిచేశాడు. కానీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఒక ఉద్యోగం కూడా అతనికి దొరకలేదు. ఇన్ని డిగ్రీలు ఉన్నప్పటికీ ఒక్క డిగ్రీ కూడా అతనికి ఉపయోగపడలేదు. చాలా కంపెనీలకు తన రెజ్యూమ్‌లు పంపాడు. చాలా ఇంటర్య్వూలే హాజరయ్యాడు. కానీ ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. కానీ పొట్ట నింపుకోవాలి కదా.. అందుకే డెలివరీబాయ్‌గా చేరాడు.

విచిత్రం ఏంటంటే.. డింగే ఇటీవల ఆక్స్‌ ఫర్డ్‌ లో డిగ్రీ పూర్తి చేశాను...కానీ ఇప్పడు డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాను అని సోషల్ మీడియలో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. ఇంకా డింగ్ ఏం చెప్పాడంటే.. ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగం స్థిరమైన ఉద్యోగం అని, తాను ఎంత చేసుకుంటే అంత సంపాదించుకోవచ్చని చెబుతున్నాడు.

నిజమే.. డింగ్ మాత్రమే కాదు ఈ ప్రపంచంలో ఎంతోమంది పెద్ద పెద్ద డిగ్రీలు పూర్తి చేసినా కూడా ఉద్యోగాలు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. మరికొంతమంది అయితే ఆత్మహత్యలకు పాల్బడుతున్నారు. కానీ డింగ్ అలాంటి వాళ్లు అందరికీ ఆదర్శం. డిగ్రీలు పెద్ద ఉద్యోగాన్ని ఇవ్వనవసరం లేదు. ఆత్మవిశ్వాసాన్ని ఇస్తే చాలు. ఇప్పుడు డింగ్‌కు ఉన్నది కూడా అదే. ఉద్యోగం రాలేదని బాధపడేదానికన్నా దొరికన ఉద్యోగాన్ని సంతోషంగా చేయడం చాలా ఉత్తమం. అదే డింగ్ నిరూపించాడు. గ్రేట్ డింగ్.

Indira Ram

Indira Ram

Next Story