పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఆర్మీ కాళ్లు పట్టుకున్నాడు.. పీఎంఎల్‌ఎన్‌ ఉపాధ్యక్షురాలు మరియమ్‌ నవాజ్‌ విమర్శలు

Pakistani Leader Maryam Nawaz Comments on Pakistan Ex PM Imran Khan
x

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఆర్మీ కాళ్లు పట్టుకున్నాడు.. పీఎంఎల్‌ఎన్‌ ఉపాధ్యక్షురాలు మరియమ్‌ నవాజ్‌ విమర్శలు

Highlights

Pakistan: ఇమ్రాన్‌కు కటకటాలు తప్పవన్న మరియమ్‌

Pakistan: పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై పీఎంఎల్‌-ఎన్‌ ఉపాధ్యక్షురాలు, మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కూతురు మరియమ్‌ నవాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్‌ తన ప్రభుత్వాన్ని కాపాడమని ఆర్మీ కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో తమను గట్టెక్కించాలని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ ఉపాధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీని కూడా వేడుకున్నట్టు మరియమ్‌ తెలిపారు. తన అధికారాన్ని కాపాడుకునేందుకు ఇమ్రాన్‌ అన్ని రకాలుగా అడ్డదారులు తొక్కినట్టు మరియమ్‌ ఆరోపించారు. అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకునేందుకు మరింత ఆలస్యం చేసేందుకు యత్నించినట్టు చెప్పారు. అందుకే తాము అర్ధరాత్రి సుప్రీం కోర్టును ఆశ్రయించామని మరియమ్‌ తెలిపారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ఎప్పుడూ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌పై పడి ఏడ్చేవారని ఆరోపించింది. ఒకవేళ నవాజ్‌ షరీఫ్‌ తిరిగి వస్తే ఇమ్రాన్‌ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆమె వ్యాఖ్యానించారు.

మూడున్నరేళ్లుగా ఇమ్రాన్‌ను పెవిలియన్‌కు పంపడానికి యత్నించినట్టు మరియమ్‌ నవాజ్‌ తెలిపారు. తాము నవాజ్‌ షరీఫ్‌ మార్కు పాలిటిక్స్‌ను పాటిస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు ఇమ్రాన్‌ పొలిటికల్‌ కప్‌ కోసం కాకుండా టీ కప్‌ కోసం క్రికెట్‌ ఆడితే మంచిదని వ్యంగ్యంగా సూచించారు. అవినీతికి పాల్పడిన ఇమ్రాన్‌, ఆయన కేబినెట్‌లోని మంత్రులు త్వరలో కటకటాల వెనక్కి వెళ్తారని మరియమ్‌ జోస్యం చెప్పారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వాన్ని మంత్రవిద్యతో నడపాలని యత్నించినట్టు విమర్శించారు. భారీగా ఇమ్రాన్‌ ఖాన్‌ వైఫ్‌ బుష్రా బీబీ మత బోధకురాలు కావడంతోనే మరియమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా బుష్రా స్నేహితురాలు ఫరా గోగి దేశం విడిచి వెళ్లిపోవడాన్ని ప్రస్తావించారు. ఇమ్రాన్ అవినీతిపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందన్నారు. ఇమ్రాన్‌ తోషాఖాన్‌ అంటూ మరియమ్‌ సంబోధించారు. తోషా అంటే ఖజానా అని ఖాజానాకు చెందిన విలువైన వస్తువులను దుబాయ్‌ బహిరంగ మార్కెట్లో ఇమ్రాన్‌ అమ్ముకున్నట్టు ఆరోపించారు.

ఏప్రిల్‌ 10 రాత్రి అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షాలు తమ బలాన్ని నిరూపించుకోవడంతో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. పాకిస్థాన్‌లో ఇప్పటి వరకు ముగ్గురు ప్రధానులపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఇద్దరు ప్రధానులు మాత్రం అవిశ్వాస తీర్మానంలోని ఓటింగ్‌కు ముందే రాజీనామా చేశారు. అయితే అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌లో ఓడిపోయిన తరువాత రాజీనామా చేసిన తొలి ప్రధానిగా ఇమ్రాన్‌ రికార్డులకెక్కడు. అయితే పాకిస్థాన్‌లో ఇప్పటివరకు ఏ ప్రధాని ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడపలేదు. అక్కడి అర్మీ కనుసన్నల్లోనే ప్రభుత్వాలు మసలుకుంటున్నాయి. 75 ఏళ్ల పాక్‌ చరిత్రలో అత్యధిక కాలం దేశాన్ని ఆర్మీనే పాలించడం గమనార్హం.

Show Full Article
Print Article
Next Story
More Stories