భారత్‌ను ఆకాశానికి ఎత్తేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్

Imran Khan: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 20 March 2022 7:30 PM IST
Pakistan Prime Minister Imran Khan Praises India
X

భారత్‌ను ఆకాశానికి ఎత్తేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్

Imran Khan: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను ఏకంగా ఆకాశానికి ఎత్తేశారు. భారత విదేశీ పాలసీ భేష్ అని అన్నారు. భారత విధానాలు ఆ దేశానికి మంచి చేస్తున్నాయన్నారు. దేశ పైరుల కోసం భారత్ ఎంతకైనా తెగిస్తుందన్నారు. ఏ ఒత్తిళ్లకు లొంగకుండా భారత్ ఉంటుందన్నారు. ఇండియన్ ఆర్మీపై ఇమ్రాఖాన్ ప్రశంసలు కురిపించారు.

ప్రభుత్వంలో ఇండియన్ ఆర్మీ జోక్యం చేసుకోదన్నారు. పాక్ ఆర్మీని తిడుతూ భారత ఆర్మీని పొగడ్తలతో ముంచెత్తారు. ఆర్మీకి డబ్బులిచ్చి ప్రభుత్వాన్ని కాపాడుకోలేనన్నారు ఇమ్రాన్. ఇస్లామిక్ దేశాల సదస్సు తర్వాత ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలని పాక్ ఆర్మీ డిమాండ్ చేసింది. రాజీనామాకు ఎప్పుడైనా సిద్ధమని ప్రకటించారు ఇమ్రాన్ ఖాన్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story