Article 370: ఆర్టికల్‌ 370 విషయంలో మాట మార్చిన పాక్‌ మంత్రి

Article 370: ఆర్టికల్ 370 రద్దు భారత్ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పిన పాకిస్తాన్... హఠాత్తుగా మాట మార్చేసింది.

Arun Chilukuri
Published on: 11 May 2021 12:14 PM IST
Pakistan Minister Mahmood Qureshi Backtracks After Saying Article 370 is India’s Internal Matter
X

Article 370: ఆర్టికల్‌ 370 విషయంలో మాట మార్చిన పాక్‌ మంత్రి

Article 370: ఆర్టికల్ 370 రద్దు భారత్ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పిన పాకిస్తాన్... హఠాత్తుగా మాట మార్చేసింది. పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ చేసిన ఈ ప్రకటనపై పాక్ రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఖురేషీ మాట మార్చేసి, ట్వీట్ చేశారు. కాశ్మీర్ అంశం ఎప్పటికీ భారత్ అంతర్గత వ్యవహారం కాబోదు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎజెండాలో జమ్మూ కశ్మీర్‌ను అంతర్జాతీయ వివాదంగా పరిగణించారని తెలిపారు. ఐరాస పర్యవేక్షణలో ప్రజాభిప్రాయం జరిగితేనే దీనికి పరిష్కారం లభిస్తుంది. కశ్మీర్‌కు సంబంధించిన ఏ సమస్య కూడా భారత్‌ అంతర్గత అంశం కాదని ట్విట్టర్ వేదికగా ఖురేషీ ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story