Nirav Modi Case: నీరవ్ మోడీ కేసులో భారత్‌కు విజయం

Arun Chilukuri
Updated on: 25 Feb 2021 4:56 PM IST
Nirav Modi to be brought to India soon
X

నీరవ్ మోడీ కేసులో లండన్‌ కోర్టు తుది తీర్పు

Nirav Modi Case: నీరవ్ మోడీ కేసులో భారత్‌ ఘనవిజయం సాధించింది. మనీ లాండరింగ్ వ్యవహారంలో లండన్‌‌కు పారిపోయిన నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ కోర్టు అనుమతి ఇచ్చింది. భారత వాదనలతో ఏకీభవించిన యూకే కోర్టు నీరవ్‌పై అభియోగాలు రుజువయ్యాయని తుది తీర్పు చెప్పింది. భారత ఈడీ అధికారులు సమర్పించిన ఆధారాలతో బ్రిటన్ కోర్టు సంతృప్తి చెందింది. అంతేకాదు, నీరవ్ మోడీ సాక్ష్యాలను నాశనం చేశారని యూకే కోర్టు వ్యాఖ్యానించింది. అదెవిదంగా నీరవ్ మానసిక స్థితి సరిగా లేదన్న వాదనలను సైతం బ్రిటన్ కోర్టు కొట్టివేసింది. మనీ లాండరింగ్ కేసులో అభియోగాలు రుజువు కావడంతో నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించాలంటూ బ్రిటన్ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story