Naked Old Man Chases Pig: లాప్‌టాప్ ప‌ట్టుకెళ్లిన పంది.. న‌గ్నంగా వృద్ధుడిని ప‌రుగులు

Naked Old Man Chases Pig: లాప్‌టాప్ ప‌ట్టుకెళ్లిన పంది.. న‌గ్నంగా వృద్ధుడిని ప‌రుగులు
x
Highlights

Naked Old Man Chases Pig: అడవి పంది ఓ వృద్ధుడిని హడళెత్తించింది. టెన్షన్ ‌పెట్టి ఏకంగా కిలోమీటరు మేర పరిగెత్తించింది.అది కూడా నగ్నంగా.. ఈ సంఘటన జర్మనీలో టుఫెల్సీలో చోటుచేసుంది.

Naked Old Man Chases Pig: అడవి పంది ఓ వృద్ధుడిని హడళెత్తించింది. టెన్షన్ ‌పెట్టి ఏకంగా కిలోమీటరు మేర పరిగెత్తించింది.అది కూడా నగ్నంగా.. ఈ సంఘటన జర్మనీలో టుఫెల్సీలో చోటుచేసుంది. ఇప్పుడు ఈ వీడియో నెటింట్లో తెగ వైర‌లవుతుంది. వివ‌రాల్లొకెళ్తే..ట్యూఫెల్సీ సరస్సు ఒడ్డున ఓ వృద్ధుడు స్నానం చేస్తుండ‌గా .. వెనకనుంచి ఓ పంది వచ్చి.. ఆయన ల్యాప్‌టాప్ ఉన్న సంచిని నోట కరచుకొని పరుగు పెట్టింది. దీంతో గాబరా పడిపోయిన వృద్ధుడు.. వెనకా ముందూ ఆలోచించకుండా.. నా సంచి, నా ల్యాప్‌టాప్ అంటూ పంది వెంట పరుగు పెట్టాడు. అది కూడా న‌గ్నంగా.

ఆ టైంలో ఆ సరస్సు దగ్గర చాలా మంది టూరిస్టులు ఉన్నారు. వాళ్లంతా ఆయన్ని చూసి తెగ నవ్వుకున్నారు.మొత్తం మీద విశ్వప్రయత్నం చేసీ మరీ అతడు తన ల్యాప్‌టాప్ వెనక్కు తెచ్చుకున్నాడు. దింతో అక్కడున్నవారు చప్పట్లు కొడుతూ అతడిని ప్రశంసించారు. ఐతే...ఆ ఈ ఘ‌ట‌న‌ను ఓ వ్య‌క్తి కెమెరాలో బంధించి సోష‌ల్ మీడియాలో పెట్టాడు. దీంతో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories