మిస్‌ వరల్డ్‌ పోటీలపై కరోనా ఎఫెక్ట్.. వైరస్ బారినపడ్డ 17 మంది కంటెస్టెంట్లు

పోటీలను తాత్కాలికంగా వాయిదా వేసిన నిర్వాహకులు మూడు నెలల్లో పోటీలను రీ షెడ్యూల్‌ చేస్తామని ప్రకటన

Sandeep Reddy
Updated on: 17 Dec 2021 1:06 PM IST
Miss World 2021 Cancelled due to COVID-19 Positive Cases
X

వైరస్ బారినపడ్డ 17 మంది కంటెస్టెంట్లు

Miss World 2021: ప్రపంచ సుందరి పోటీలపై కరోనా పంజా విసిరింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 17 మంది కంటెస్టెంట్లు వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. భారత్‌ నుంచి వెళ్లిన మిస్ ఇండియా మానస వారణాసికి కూడా వైరస్‌ సోకింది. ప్రస్తుతం మానస ప్యూర్టోరికోలో ఐసోలేషన్ లో ఉన్నట్లు సమాచారం. కాగా ఈ పోటీలను తాత్కాలికంగా వాయిదా వేశారు నిర్వాహకులు. కాగా మరో మూడు నెలల్లో పోటీలను రీ షెడ్యూల్‌ చేస్తామని ప్రకటించినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి మిస్‌ వరల్డ్ 2021 పోటీలు ప్యూర్టోరికో వేదికగా డిసెంబర్ 16 నుంచి ప్రారంభించాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో పోటీదారులు, సిబ్బంది, సాధారణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వీటిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు నిర్వహకులు తెలిపారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story