మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు కరోనా

Bill Gates: ఐసోలేషన్‌కు వెళ్తున్నట్టు ట్విట్టర్‌లో స్పష్టం

Rama Rao
Published on: 11 May 2022 10:02 AM IST
Microsoft Co-founder Bill Gates Tests Covid Positive
X

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు కరోనా

Bill Gates: ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ తొలిసారి కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉన్నట్టు స్వయంగా ఆయనే సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. డాక్టర్ల సూచన మేరకు తాను కోలుకునేవరకు ఐసోలేషన్‌కు వెళ్తున్నట్టు గేట్స్‌ చెప్పారు. తాను కరోనా వ్యాక్సిన్‌ బూస్టర్‌ తీసుకుని ఆరోగ్య సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవడం తన అదృష్టమని మరో ట్వీట్‌లో వివరించారు. గేట్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మహమ్మారిపై పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. మనలో ఎవరూ మళ్లీ వైరస్‌ బారిన పడకుండా సాధ్యమైనంతమేరకు కృషి చేస్తామని బిల్‌గేట్స్‌ చెప్పారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా పేద దేశాల్లో ప్రజలకు గతేడాది అక్టోబరులో 120 మిలియన్ డాలర్లు వెచ్చించారు.

Rama Rao

Rama Rao

Next Story