Monalisa: ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 'చిరునవ్వు'.. దీనిని సేఫ్ గా ఉంచేందుకు కొత్త ప్లాన్..!

Louvre Museum Renovation France Plans a Grand Makeover for Mona Lisa’s Priceless Smile
x

Monalisa: ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 'చిరునవ్వు'.. దీనిని సేఫ్ గా ఉంచేందుకు కొత్త ప్లాన్..!

Highlights

Monalisa: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 'చిరునవ్వు' మోనాలిసాది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Monalisa: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 'చిరునవ్వు' మోనాలిసాది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మోనాలిసా పెయింటింగ్ ను ఫ్రాన్స్‌లోని పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలో భద్రపరిచారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ పెయింటింగ్.. ఆమె 'చిరునవ్వు' చూడటానికి ఫ్రాన్స్‌కు వస్తారు. కానీ ఇప్పుడు ఫ్రెంచ్ ప్రభుత్వం దానిని సురక్షితంగా ఉంచడానికి ఒక కొత్త ప్రణాళికను రూపొందించింది. ఈ సారి మోనాలిసాను చూడాలంటే కాస్ట ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావొచ్చు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ లౌవ్రే మ్యూజియం పునరుద్ధరణ కోసం ఒక అద్భుతమైన ప్రణాళికను రూపొందించారు. ఇందులో లియోనార్డో డా విన్సీ కలకాలం నిలిచిపోయే పెయింటింగ్ 'మోనాలిసా' కోసం మ్యూజియంలో ప్రత్యేక గదిని ఏర్పాటు చేయనున్నారు.

ఈ పునరుద్ధరణ ప్రాజెక్టులో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మ్యూజియం లోపల భూగర్భ గదులను సృష్టించడం.. అలాగే షీన్ నది నుండి ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేయడం. ఈ పునరుద్ధరణ ఖర్చు గురించి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ ఇది వేల కోట్ల యూరోల విలువైన ప్రణాళిక అని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇది పూర్తి కావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. లౌవ్రే మ్యూజియం డైరెక్టర్ లారెన్స్ డెస్ కార్స్ ఇటీవల మ్యూజియం దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. దీని కారణంగానే ఫ్రెంచ్ ప్రభుత్వం దాని పునరుద్ధరణకు ఒక ప్రణాళికను రూపొందించింది.

లోరీ మ్యూజియం దాని విలక్షణమైన గాజు పిరమిడ్ ఆకారంలో ఉన్న ఎంట్రెన్స్ గేటుతో చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని 1989 లో ప్రారంభించారు. కానీ ఇప్పుడు అది నేటి అవసరాలకు అనుగుణంగా పాతబడిపోయింది. ఇక్కడ రెస్ట్‌రూమ్, రెస్టారెంట్ వంటి సౌకర్యాలు లేవు. కాబట్టి దాని పునరుద్ధరణ అవసరం. లౌవ్రే మ్యూజియం పునరుద్ధరణకు అయ్యే ఖర్చును ప్రభుత్వం వెల్లడించలేదు.. కానీ ఫ్రాన్స్‌లోని పాంపిడో సెంటర్ ఐదు సంవత్సరాల కాలంలో ప్రణాళికాబద్ధమైన పునరుద్ధరణకు లోనవుతుంది. దీని ధర దాదాపు 273 మిలియన్ డాలర్లు. లోరీ మ్యూజియం ఆదాయం ప్రధానంగా టిక్కెట్ల అమ్మకాలు, సావనీర్ దుకాణాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలు, ప్రత్యేక కార్యక్రమాల నుండి వస్తుంది. ఫ్రాన్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) సహకారంతో అబుదాబిలో కూడా లోవ్రే మ్యూజియం ఓ బ్రాంచ్ ప్రారంభించింది. రాబోయే రోజుల్లో పారిస్ లోవ్రే మ్యూజియం కొత్త రూపాన్ని చూసేందుకు అభిమానులు మరింత అధిక ఖర్చు చేయాల్సిన సమయం రానుందనేది స్పష్టమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories