America: అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం

అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం
America: అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం
America: అమెరికాలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. విమానాలకు అంతరాయం లేకుండా ఏటీ అండ్ టీ, వెరైజన్ టెలికాం సంస్థలు 5జీ సేవలను ప్రారంభించాయి. ఈ క్రమంలో కొన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ విమానాలను రద్దు చేసుకున్నాయి. అమెరినా నుంచి వెళ్లే లేదా అమెరినా రావాల్సిన మొత్తం 538 విమానాలు 5జీ సేవలు ప్రారంభమవడం కారణంగా రద్దు కానున్నాయని నివేదికలు వచ్చాయి. అయితే బుధవారం నాడు కేవలం 215 విమానాల మాత్రమే రద్దయ్యాయి. వీటిలో ఎమిరేట్స్, ఎయిర్ ఇండియా, ANA, జపాన్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన విమానాలున్నాయి.
విమానయాన సంస్థల అభ్యంతరాలతో అమెరికాలోని కొన్ని ఎయిర్‌పోర్టుల చుట్టూ 5జీ సర్వీసుల ప్రారంభాన్ని ఏటీ అండ్ టీ, వెరిజన్ టెలికాం సంస్థలు తాత్కాలికంగా నిలిపివేశాయి. మిగిలిన చోట్ల సేవల్ని ప్రారంభించినట్లు ఆ సంస్థలు తెలిపాయి. అమెరికాలో బుధవారం నుంచి 5జీ సేవలు ప్రారంభించనున్నట్లు తెలియడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన విమానయాన సంస్థలు అమెరికాకు వెళ్లాల్సిన విమానాలను రీషెడ్యూల్ చేశాయి. ఎయిరిండియా సైతం అమెరికాకు వెళ్లాల్సిన కొన్ని విమానాలను నడపలేకపోతున్నామని ట్విటర్ వేదికగా ప్రకటించింది.
3.7- 3.98 గిగాహెర్ట్జ్ ఫ్రీకెన్సీ బ్యాండ్లలో 5జీ సేవల నిర్వహణకు గతేడాది ఫిబ్రవరిలో వెరైజన్, ఏటీ అండ్ టీ లక్షల కోట్ల రూపాయల విలువైన ఆర్డరు దక్కించుకున్నాయి. అమెరికాలో 5జీ సేవలు 2021 డిసెంబరు 5 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా సాధ్యపడలేదు.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు బంద్...
25 May 2022 3:45 AM GMTపంజాబ్‌లో మాన్ కేబినెట్ నుంచి ఓ మినిస్టర్ ఔట్...
25 May 2022 3:34 AM GMTముగ్గురు సేఫ్.. శిథిలాల్లో మరికొందరు.. జమ్మూ సొరంగ మార్గంలో సాగుతున్న...
25 May 2022 2:59 AM GMTఅమెరికాలో స్కూల్లో కాల్పులు.. 18 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు ...
25 May 2022 2:43 AM GMTఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై కేటీఆర్...
25 May 2022 2:15 AM GMT