Joe Biden: ఉక్రెయిన్ కు అన్ని రకాలుగా సహకారం అందిస్తాం

Joe Biden: ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తే సహించం

Rama Rao
Published on: 23 Feb 2022 7:43 AM IST
Joe Biden Announced that he would Provide all Kinds of Assistance to Ukraine
X

Joe Biden: ఉక్రెయిన్ కు అన్ని రకాలుగా సహకారం అందిస్తాం

Joe Biden: ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ రష్యాను హెచ్చరించారు. రష్యాపై ఆర్థిక పరమైన ఆంక్షలను తక్షణమే అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యాపార కార్యకలాపాలను నిలిపివేస్తున్నామన్నారు. రష్యన్ బ్యాంకులకు సంబంధించి ఆంక్షలను కఠిన తరం చేశారు. రష్యన్ బలగాలను వెనుక్కి పిలిపించకుంటే ఉక్రెయిన్ కు అమెరికా బలగాలను పంపుతామన్నారు. ఉక్రెయిన్ కు అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని బైడన్ ప్రకటించారు. శాంతి వాతావరణానికి రష్యా సహకరించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటొందనే సంకేతాలు జారీ చేశారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఘర్షణపూరిత వాతావరణం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తంచేశారు. రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని బైడన్ ఆగ్రహించారు.

Rama Rao

Rama Rao

Next Story