Lawsuit Against Trump's Order on H1B Visa: హెచ్ -1 బి వీసా విధానానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన 174 మంది భారతీయులు

Lawsuit Against Trumps Order on H1B Visa: హెచ్ -1 బి వీసా విధానానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన 174 మంది భారతీయులు
x
Indians file lawsuit against Trump’s order on H1B visa
Highlights

Lawsuit Against Trump’s Order on H1B Visa: హెచ్ -1 బి వీసా విధానానికి వ్యతిరేకంగా అమెరికాలో నివసిస్తున్న 174 మంది భారతీయులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు

Lawsuit Against Trump's Order on H1B Visa: హెచ్ -1 బి వీసా విధానానికి వ్యతిరేకంగా అమెరికాలో నివసిస్తున్న 174 మంది భారతీయులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొలంబియా కోర్టులో దాఖలైన ఈ పిటిషన్ లో.. కొత్త హెచ్ -1 బి నియమం కుటుంబాలను వేరు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కారణంగా, కొంతమందికి వీసా లభించకపోవడంతో వారు అమెరికాకు రాలేకపోయారని పేర్కొన్నారు. ఈ కేసులో సమాధానం చెప్పడానికి కొలంబియా జిల్లా కోర్టు బుధవారం విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీ మరియు యాక్టింగ్ హోంల్యాండ్ సెక్యూరిటీ చీఫ్ మరియు కార్మిక కార్యదర్శికి సమన్లు జారీ చేసింది.

174 మంది భారతీయులు తమ న్యాయవాది వాస్డెన్ బెనియాస్ తరపున ఈ కేసును దాఖలు చేశారు. హెచ్ -1 బి, హెచ్ -4 వీసాలపై నిషేధం అమెరికా ఆర్థిక వ్యవస్థకు హాని కలిగిస్తుందని పేర్కొంది. ఇది కుటుంబాలను వేరు చేస్తుందని.. అలాగే ఇది పార్లమెంట్ ఆదేశాలకు కూడా వ్యతిరేకం అని పేర్కొన్నారు. హెచ్ -1 బి, హెచ్ -4 వీసాలకు సంబంధించిన కొత్త ఆర్డర్‌లను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. అదనంగా, ఈ వీసాలకు సంబంధించిన పెండింగ్ కేసులన్నింటినీ ముగించాలని విదేశాంగ శాఖను ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు.

జూన్ 22 నుంచి వచ్చే ఏడాది వరకు హెచ్ -1 బి వీసాలు ఇవ్వడాన్ని ట్రంప్ నిషేధించారు. ఆ సందర్బంగా ఈ విధానం వలన అమెరికన్లకు ఎక్కువ ఉపాధి అవకాశాలను లభిస్తాయని అన్నారు. అయితే భారత్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చింది.


Show Full Article
Print Article
Next Story
More Stories