PM Modi: పారిస్ లో భారత ప్రధాని మోడీకి ఘన స్వాగతం..

PM Modi: డిజిటల్ చెల్లింపులపై ఫ్రాన్స్ - భారత్ఒప్పందంతో మంచి ఫలితాలు

Shekhar G
Published on: 14 July 2023 8:37 AM IST
Indian Prime Minister Modi Received A Warm Welcome In Paris
X

PM Modi: పారిస్ లో భారత ప్రధాని మోడీకి ఘన స్వాగతం.. 

PM Modi: ఫ్రాన్స్ పర్యటనకు చేరుకున్న భారత ప్రధాని మోడీకి , ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బార్న్ ఘనస్వాగతించారు. ప్రధాని మోడీ, ఫ్రాన్స్ సైనిక దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం - బాస్టిల్ డే వేడుకల్లో గౌరవ అతిథిగా మోడీ హాజరు కానున్నారు.

భారత్ - ఫ్రాన్స్ ల మధ్య అవినాభావ సంబంధం మహోన్నతమైందని భారత ప్రధాని మోడీ అన్నారు. ఇరుదేశాల మైత్రీ పర్యాటక రంగా అభివృద్ధికి ఊతమిస్తోందన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో ఆయన ప్రవాస భారతీయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ప్రధాని మోదీని కీర్తిస్తూ చేసిన నినాదాలతో మోదీ తన్మయుడయ్యారు. మోడీ ప్రసంగంతో ప్రవాసభారతీయులు అడుగడుగునా.. కరతాళ ధ్వనులతో హర్షం ప్రకటించారు. డిజిటల్ చెల్లింపుల్లో సంస్కరణలతో యూనిఫైడ్ ఇంటర్ ఫేస్ ద్వారా ఆర్థిక లావాదేవీలను సరళ తరం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

Shekhar G

Shekhar G

Next Story