పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

Imran Khan: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ RSSపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 16 July 2021 7:52 PM IST
Imran Khan Blames RSS Ideology for no Talks With India
X

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

Imran Khan: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ RSSపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము భారత్‌తో చర్చలకు సిద్ధంగానే ఉన్నామని, అయితే RSS భావజాలమే అందుకు అవరోధంగా మారిందన్నారు. ''పొరుగు దేశమైన భారత్‌తో సఖ్యతగా ఉండడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. కానీ ఏం చేయాలి? మధ్యలో ఆరెస్సెస్ భావజాలం వచ్చి చేరిందని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.

మరోవైపు ఇమ్రాన్ కామెంట్స్‌పై నిమిషాల్లోనే బీజేపీ కౌంటర్ ఇచ్చింది. పాక్ ప్రధానివి అర్ధం లేని కామెంట్స్ అంటూ కేంద్ర సహాయ మంత్రి కౌశల్ కిషోర్ ఫైర్ అయ్యారు. తీవ్రవాద మూలాలు పాకిస్తాన్‌లోనే ఉన్నాయన్న విషయం ఇమ్రాన్‌కు కూడా తెలుసని చురకలంటించారు. RSSను విమర్శించి లాభం లేదని, అదో అర్థంపర్థంలేని వ్యాఖ్య అని కౌశల్ కిశోర్ మండిపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story