అమెరికాలో కార్చిచ్చు.. 8వేల ఎకరాల అడవులు ధ్వంసం

అమెరికా రాష్ట్రం కాలిఫోర్నియా, అరిజోనా అడవుల్లో కార్చిచ్చు రేగింది. అడవిలో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి.

Raj
By Raj
Updated on: 13 Jun 2020 7:57 PM IST
అమెరికాలో కార్చిచ్చు.. 8వేల ఎకరాల అడవులు ధ్వంసం
X

అమెరికా రాష్ట్రం కాలిఫోర్నియా, అరిజోనా అడవుల్లో కార్చిచ్చు రేగింది. అడవిలో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. దక్షిణ కాలిఫోర్నియాలోని క్యాంప్ పెండిల్టన్‌లో గత 24 గంటల్లో దాదాపు 8,000 ఎకరాల అడవులు ధ్వంసమయ్యాయి. అదే సమయంలో, లాస్ ఏంజిల్స్‌లోని వివిధ ప్రాంతాల్లో 1200 ఎకరాల అడవులు మంటలకు దెబ్బతిన్నాయి.

అలాగే వెంచురా కౌంటీలోని 200 ఎకరాల అడవిలో మంటలు చెలరేగాయి. దీంతో అడవికి సమీపంలో ఉన్న సరస్సు పిరు ప్రాంతంలోని 2100 మందిని తరలించారు. ఇక్కడ 125 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రజలను సురక్షితమైన ప్రదేశాలకు తరలించారు.


Raj

Raj

Next Story