అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం.. 19 మంది మృతి.. 60 మందికి పైగా గాయాలు

Fire Accident - America: *మృతుల్లో 9 మంది చిన్నారులు *మంటలను అదుపుచేస్తున్న ఫైర్‌ సిబ్బంది

Shireesha
Updated on: 10 Jan 2022 8:18 AM IST
Fire Accident in Apartment in New York America Today 10 01 2022 Killed 19 Members | International News
X

అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం.. 19 మంది మృతి.. 60 మందికి పైగా గాయాలు

Fire Accident - America: అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. న్యూయార్క్‌‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. మరో 60 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 9 మంది పిల్లలు కూడా ఉన్నారు.

19 అంతస్తులున్న అపార్ట్‌మెంట్‌లో రెండు, మూడు ఫ్లోర్లలో మంటలు చెలరేగాయి. అపార్ట్‌మెంట్‌ మొత్తం దట్టమైన పొగ కమ్మేయడంతో చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story