Elon Musk: ట్విట్టర్‌కి కొత్త సీఈవోగా మహిళను నియమించిన మస్క్
Elon Musk: తాను సీటీవోగా కొనసాగుతానన్న ఎలాన్ మస్క్
Elon Musk: ట్విట్టర్‌కి కొత్త సీఈవోగా మహిళను నియమించిన మస్క్
Elon Musk: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్ కు కొత్త సీఈవో రానున్నారు. మరో 6 వారాల్లో కొత్త సీఈఓగా ఓ మహిళ బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుతం సీఈవోగా కొనసాగుతున్న ఎలాన్ మస్క్ స్వయంగా ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. అయితే, నూతన సీఈఓగా బాధ్యతలు తీసుకోనున్న వ్యక్తి మహిళ అనే విషయం తప్ప.. మరే ఇతర విషయాన్ని మాత్రం మస్క్ స్పష్టంగా చెప్పలేదు. ట్విటర్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత తాను చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ , ప్రాడక్ట్, సాఫ్ట్‌వేర్ విభాగాల బాధ్యతలు చూసుకోనున్నట్లు ఎలాన్ మస్క్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Next Story




