పుతిన్ గురించి బాగా తెలుసు.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు

*ఉక్రెయిన్‌ సంక్షోభంపై స్పందించిన ట్రంప్

Rama Rao
Updated on: 23 Feb 2022 11:00 AM IST
Donald Trump Comments On Vladimir Putin | Telugu News Online
X

ఉక్రెయిన్‌ సంక్షోభంపై స్పందించిన ట్రంప్

Donald Trump: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ గురించి తనకు బాగా తెలుసునంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అన్నారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులపై స్పందించిన ఆయన.. తన హయాంలో ఈ సంక్షోభం రాలేదన్నారు. అమెరికా ముందే సరైన రీతిలో వ్యవహరించి ఉంటే.. ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేవి కాదన్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా చమురు ధరలు భారీగా పెరుగుతాయని ట్రంప్‌ స్పష్టం చేశారు. పుతిన్‌ అనుకున్నది సాధించడమేకాదు. చమురు, గ్యాస్‌ ధరల పెరుగుదల కారణంగా చమురు వ్యాపారులకు మేలు జరుగుతుందని ట్రంప్‌ వివరించారు.

Rama Rao

Rama Rao

Next Story