రష్యాలో రాజ్‌నాథ్, చైనా రక్షణ మంత్రి మధ్య చర్చ..

రష్యాలో రాజ్‌నాథ్, చైనా రక్షణ మంత్రి మధ్య చర్చ..
x
Highlights

జూన్ 15న గాల్వన్ ఘర్షణ తర్వాత తొలిసారిగా రష్యాలో భారత్, చైనా రక్షణ మంత్రులు శుక్రవారం ముఖాముఖి..

జూన్ 15న గాల్వన్ ఘర్షణ తర్వాత తొలిసారిగా రష్యాలో భారత్, చైనా రక్షణ మంత్రులు శుక్రవారం ముఖాముఖి సమావేశం నిర్వహించారు. రెండున్నర గంటల పాటు షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్ద్యేశ్యం సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడం. సమావేశంలో భారత రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. గాల్వన్ వ్యాలీతో సహా వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఐసి) పై గత కొన్ని నెలలుగా ఉద్రిక్తత పరిస్థితి ఉందని రాజ్‌నాథ్ చైనా విదేశాంగ మంత్రి వీ ఫెంగ్గేతో అన్నారు. సరిహద్దులో చైనా తన దళాలను పెంచి దూకుడు ప్రవర్తనను చూపుతుందని అన్నారు. ఇది ద్వైపాక్షిక ఒప్పందం ఉల్లంఘన అని రాజ్‌నాథ్ అన్నారు. సరిహద్దులో భారత బలగాలు ఎప్పుడూ సంయమనంతో ఉన్నాయని రాజ్‌నాథ్ అన్నారు.

కానీ అదే సమయంలో, భారతదేశం సార్వభౌమత్వం , భారత సరిహద్దుల రక్షణపై ఎటువంటి రాజీ లేదని చైనా మంత్రికి స్పష్టం చేశారు. సరిహద్దు వద్ద శాంతిని కొనసాగించడానికి భారత్ సిద్ధంగా ఉందని అన్నారు. కాగా కొంతకాలంగా చైనా సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న సంగతి తెలిసిందే. జూన్ 15న లడాక్‌లోని గాల్వన్‌లో చైనా సైనికులు ముళ్ల తీగతో భారత జవాన్లపై దాడి చేయడంతో.. భారతదేశానికి చెందిన 20 మంది సైనికులు అమరవీరులయ్యారు. అయితే ఇందుకు ప్రతీకారంగా 35 మంది చైనా సైనికులను భారత్ మట్టుబెట్టింది. ఆ తరువాత సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి గత నెలల్లో ఇరుదేశాలు అనేకసార్లు చర్చలు జరిపినప్పటికీ.. చైనా చేష్టలు మాత్రం ఆగడం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories