China Floods: చైనాలో కొనసాగుతున్న జల విలయం

China Floods: చైనాలో జల విలయం కొనసాగుతోంది. వెయ్యేళ్లలో కనీవినీ ఎరుగని భారీ వర్షాలకు మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Arun Chilukuri
Updated on: 23 July 2021 9:15 PM IST
Death Toll in Central China Floods Rises to 33
X

China Floods: చైనాలో కొనసాగుతున్న జల విలయం

China Floods: చైనాలో జల విలయం కొనసాగుతోంది. వెయ్యేళ్లలో కనీవినీ ఎరుగని భారీ వర్షాలకు మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ 33మంది మృత్యువాత పడగా మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. కుండపోత వర్షాల ప్రభావం ఒక్క హెనన్ ప్రావిన్స్‌‌లోనే 30లక్షల మందిపై పడింది. మొత్తం 3.76 లక్షల మందిని రెస్క్యూటీమ్ సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తాజా వరదలతో 2.15 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతినగా, దాదాపు 14వందల కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రోడ్లపై భారీ గుంతలు ఏర్పడి ప్రజలు వాటిలోకి పడిపోతున్న వీడియోలూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story