Coronavirus: ప్రపంచవ్యాప్తంగా లక్షకు చేరువగా కరోనా మరణాలు..!

Coronavirus: ప్రపంచవ్యాప్తంగా లక్షకు చేరువగా కరోనా మరణాలు..!
x
Highlights

చైనాలోని వుహన్ నగరంలో మొదలైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది.

చైనాలోని వ్యూహాన్ నగరంలో మొదలైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఈ వైరస్ బారిన చాలా మంది చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ వలన మృతిచెందిన వారి సంఖ్య 95,718 కి చేరుకున్నది. ఇక 16 లక్షలు మందికి ఈ కరోనా సోకినట్లుగా అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ పేర్కొంది.

ఇక ఇందులో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అక్కడ జనాలు పిట్టలాగా రాలిపోతున్నారు. ఇప్పటికే అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు సార్లు కరోనా టెస్ట్ చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పటి వరకు అక్కడ 4,28,703 మంది వైరస్‌ సోకి చికిత్స పొందుతున్నారు. వీరిలో 16,679 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం ఒక్కరోజే 1,917 మంది చనిపోయారు. ఇక చైనా విషయానికి వచ్చేసరికి గురువారం అక్కడ కొత్తగా 42 మందిలో వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు.

వీరిలో 38 మంది విదేశాల నుంచి తిరిగొచ్చినవారే. హుబి ప్రావిన్సులో ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 3,336కు పెరిగింది. ఇక ఫ్రాన్స్‌లో మృతుల సంఖ్య 12,210కి చేరింది. అక్కడ వైరస్ బారినపడ్డవారి సంఖ్య 1,12,950గా ఉంది.

ఇక దక్షిణాప్రికా విషయానికి వచ్చేసరికి అక్కడ 21 రోజుల లాక్ డౌన్ విధించడంతో అక్కడ కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ పూర్తి అయినప్పటికీ మరో రెండు వారాలు పొడగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆ దేశంలో ఇప్పటి వరకు 1,934 మంది వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 18 మంది మృతిచెందారు. ఇక భారత్ విషయానికి వచ్చేసరికి వైర‌స్ సంక్రమించిన వారి సంఖ్య ఆరువేలకి పైగా చేరుకోగా, చనిపోయిన వారి సంఖ్య 199 కి చేరింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories