చాపకింద నీరులా విస్తరిస్తోన్న కరోనా.. ఒక్కరోజే 6లక్షలకు పైగా కేసులు.. 429 మంది మృతి

Coronavirus: హమ్మయ్యా..! కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది.. అని అనుకునేలోపే.. రూపు మార్చుకొని...

Shireesha
Published on: 18 March 2022 7:02 AM IST
Coronavirus and Omicron Cases Increasing in South Korea China Israel | Coronavirus Live Updates
X

చాపకింద నీరులా విస్తరిస్తోన్న కరోనా.. ఒక్కరోజే 6లక్షలకు పైగా కేసులు.. 429 మంది మృతి

Coronavirus: హమ్మయ్యా..! కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది.. అని అనుకునేలోపే.. రూపు మార్చుకొని మళ్లీ పంజా విసురుతోంది. కరోనా ఉద్భవించిన చైనాలో ఎన్నడూ లేని విధంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. స్టైల్త్‌ ఒమిక్రాన్ రూపంలో చైనాను కోవిడ్ మళ్లీ వణికిస్తోంది. మరోవైపు దక్షిణ కొరియాలో కోవిడ్‌ కల్లోలం సృష్టిస్తోంది. ఇక ఇజ్రాయెల్ మరో కొత్త వేరియంట్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు.

దక్షిణ కొరియాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఊహించని స్థాయిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే కొత్తగా 6 లక్షల కేసులు వెలుగు చూశాయి. ఇప్పటివరకు ఇంత భారీగా రోజువారీ కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. దక్షిణ కొరియాలో రికార్డు స్థాయిలో 6లక్షల 21వేల 328 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 429 మంది మృత్యువాతపడ్డారు. అంతేకాదు ఒక్కరోజులోనే 55శాతం పెరుగుదల చోటుచేసుకుంది.

ఇక ఊహించిన దానికంటే ఎక్కువగా కేసులు వెలుగుచూడటంతో వైద్యారోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుల్లో ఎక్కువగా ఒకరినుంచి ఒకరికి సంక్రమించినవేనని తెలిపారు. మొత్తానికి చైనా, దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతున్న వేళ.. ఇజ్రాయిల్‌లో మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది.

Shireesha

Shireesha

Next Story