వేగవంతమైన బుల్లెట్ ట్రైన్‌ను లాంచ్ చేసిన చైనా.. ఈ భూమ్మీదే అత్యంత వేగంతో..

China Unveils Worlds Fastest Train
x

వేగవంతమైన బుల్లెట్ ట్రైన్‌ను లాంచ్ చేసిన చైనా.. ఈ భూమ్మీదే అత్యంత వేగంతో..

Highlights

China: డ్రాగన్ కంట్రీ మరో అరుదైన ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసింది.

China: డ్రాగన్ కంట్రీ మరో అరుదైన ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసింది. ఈ భూమ్మీదే అత్యంత వేగంతో నడిచే బుల్లెట్ ట్రైన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఏకంగా గంటకు 6వందల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే బుల్లెట్ ట్రైన్‌లో దాదాపు పది బోగీలు ఏర్పాటు చేశారు. క్విన్‌డాగోలో ఈ బుల్లెట్ ట్రైన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ భూమ్మీద అన్ని వాహనాల్లోకెల్లా ఈ రైలే వేగవంతం అయినదని చైనా వెల్లడించింది. 2016 అక్టోబర్‌లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును 2020 జూన్‌లో పరీక్షించారు.

మరోవైపు డ్రాగన్ కంట్రీ తయారు చేసిన ఈ మాగ్లెవ్‌ ట్రైన్ విమానం కంటే వేగంగా దూసుకుపోనుంది. వెయ్యి కిలోమీటర్ల దూరం ఉన్న బీజింగ్ నుంచి షాంఘైకి కేవలం రెండున్నర గంటల్లో చేరుకోవచ్చు. సాధారణ రైళ్లకు, మాగ్లెవ్‌ రైళ్లకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. సాధారణ రైళ్లు పట్టాలను బేస్ చేసుకుని నడిస్తే ఈ స్పెషల్ ట్రైన్స్ మాత్రం విద్యుదయస్కాంత శక్తితో పట్టాలను తాకకుండానే దుసుకుపోతాయి. ఇలాంటి విశేషాలు మాగ్లెవ్ ట్రైన్స్‌లో చాలానే ఉన్నాయి.

ఇక చైనా గత రెండు సంవత్సరాలుగా పలు రకాల మాగ్లెవ్ రైళ్లను ఉపయోగిస్తోంది. ప్రస్తుతం చైనాలో పరిమిత సంఖ్యలో మాగ్లెవ్ రైళ్లు నడుస్తున్నాయి. ముందు ముందు మరిన్ని మాగ్లెవ్ రైళ్లను లాంఛ్ చేయాలని డ్రాగన్ కంట్రీ భావిస్తోంది. ఇదే సమయంలో జపాన్, జర్మనీ తదితర దేశాలు కూడా ఈ నయా స్పీడ్ ట్రైన్‌లపై ఫోకస్ చేస్తున్నాయి. ఈ ట్రైన్స్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తే వేల కిలోమీటర్ల దూరాన్ని గంటల్లోనే చేరుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories