ఇండియాపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన చైనా

ఇండియాపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన చైనా
x
Highlights

ఇండియా డిజిటల్ స్ట్రైక్‌తో దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది చైనాకు ! కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారైంది వాళ్ల పరిస్థితి. ఐతే కొత్తగా మరో 43...

ఇండియా డిజిటల్ స్ట్రైక్‌తో దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది చైనాకు ! కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారైంది వాళ్ల పరిస్థితి. ఐతే కొత్తగా మరో 43 అప్లికేషన్స్‌పై ఇండియా బ్యాన్ విధించగా.. డ్రాగన్ కంట్రీ మరోసారి అక్కసు వెళ్లగక్కింది.

ఓ వైపు చర్చలు అంటూనే మరోవైపు ఓవరాక్షన్ చేస్తున్న చైనాకు అన్ని రకాలుగా వార్నింగ్‌లు ఇస్తూనే ఉంది ఇండియా ! బోర్డర్‌లో దమ్‌కీ నుంచి సర్జికల్ స్ట్రైక్ వరకు గీతదాటారో సీన్ మాములుగా ఉండదన్న సంకేతాలు పంపిస్తూనే ఉంది. ఇప్పటికే మూడుసార్లు డ్రాగన్ కంట్రీ యాప్‌లను బ్యాన్ చేసిన ఇండియా మరో 43 అప్లికేషన్స్‌పై నిషేధం విధించింది. దీంతో కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారైంది చైనా పరిస్థితి. దేశసమగ్రత, భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం చెప్తున్నా డ్రాగన్‌గాళ్లు మళ్లీ తమ అక్కసు వెళ్లగక్కారు.

దేశభద్రత పేరుతో భారత్ పదేపదే తమ యాప్‌లను నిషేధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చైనా తెలిపింది. ఈ చర్యలతో ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను భారత్ ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ అక్కసు వెళ్లగక్కింది. విదేశాల్లో ఉన్న చైనా కంపెనీలు అంతర్జాతీయ నిబంధనలకు లోబడే పనిచేస్తున్నాయని అక్కడి చట్టాలకు అనుగుణంగా కంపెనీలను నిర్వహించేలా చైనా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని ఐతే భారత్‌ మాత్రం డబ్ల్యూటీవో నిబంధనలు ఉల్లంఘిస్తూ పక్షపాత ధోరణి వహిస్తోందంటూ భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి జీ రాంగ్‌ ప్రకటనలో తెలిపారు.

ఇకైనా భారత్ తన తప్పు సరిదిద్దుకుని చైనా సహా అన్ని దేశాల కంపెనీలకు పారదర్శక వ్యాపార వాతావరణాన్ని కల్పిస్తుందని ఆశిస్తున్నామని చైనా రాయబారి అంటున్నారు. ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సంబంధాలను తిరిగి గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఇరుదేశాలపైనా ఉందని చర్చల ద్వారా దీన్ని సాధించాలని చైనా అంటోంది. ఐతే డ్రాగన్ కంట్రీని నమ్మడానికి లేదని బోర్డర్‌లో ఎలాంటి చర్యలు దిగుతుంతో ప్రపంచం మొత్తం చూస్తోందని దేశ భద్రతా దృష్ట్యా చైనా యాప్‌లపై నిషేధం విధించడం సరైనదేనని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటు నాలుగుదశల్లో కలిపి మొత్తం 2వందలకు పైగా చైనా అప్లికేషన్స్‌పై భారత్ నిషేధం విధించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories