America vs China: ట్రంప్ పై చైనా ఎదురుదాడి ..రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ షురూ

America vs China: ట్రంప్ పై చైనా ఎదురుదాడి  ..రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ షురూ
x
Highlights

America vs China: అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్ మళ్లీ మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధం నేపథ్యంలో చైనా ఎదురుదాడికి...

America vs China: అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్ మళ్లీ మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధం నేపథ్యంలో చైనా ఎదురుదాడికి దిగింది. అమెరికాపై చైనా ప్రతీకార టారిఫ్స్ తో దాడి చేసింది. డొనాల్డ్ ట్రంపై చైనాతో వాణిజ్య యుద్ధం ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత ప్రతి చర్యగా అనేక రకాల అమెరికన్ వస్తువులపై చైనా ప్రతిగా 10 నుంచి 15శాతం సుంకాలను విధించింది.

చైనా చర్య ప్రపంచ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్న బొగ్గు, ఎల్ఎన్జీ ఉత్పత్తులపై 15శాతం క్రూడాయిల్, వ్యవసాయ యంత్రాలు, పెద్ద కార్లు, పికప్ ట్రక్స్, ఇతరు ఉత్పత్తులపై 10శాతం సుంకాలు విధించినున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. అమెరికా ఏకపక్షంగా సుంకాలను పెంచడం ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇది అమెరికా సమస్యలను పరిష్కరించడంలో సహాయపడటమే కాకుండా చైనా అమెరికాల మధ్య సాధారణ ఆర్థిక, వాణిజ్య సహకారాన్ని కూడా దెబ్బతీస్తుందని ప్రకటనలో తెలిపింది.

చైనా దిగుమతులపై అమెరికా 10శాతం సుంకాలను అమలు చేసిన తర్వాత ఈ చర్య తీసుకుంది. ప్రతీకార చర్యలో భాగంగా అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ పై యాంటీ ట్రస్ట్ ఉల్లంఘన ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని చైనా ప్రకటించింది. దర్యాప్తు గురించి మరిన్న వివరాలను ఆ ప్రకటనలో పేర్కొనలేదు. అయితే గూగుల్ సెర్చ్ ఇంజన్ చైనాలో బ్లాక్ చేసిన విషయం తెలిసిందే.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలు విధించే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ సుంకాలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కానీ నిరసనల తర్వాత మెక్సికో, కెనడాపై విధించిన సుంకాల వ్యవధిని ఒక నెలపాటు పొడిగించారు. కానీ చైనాపై సుంకాన్ని ఆలాగే ఉంచారు. ట్రంప్ ప్రభుత్వం సుంకాలు విధించాలనే నిర్ణయం పై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సుంకాన్ని వ్యతిరేకిస్తున్నామని చైనా ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ వాణిజ్య సంస్థలో అమెరికాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. అమెరికా తప్పుడు పద్ధతిని ఉపయోగిస్తోందని మా ప్రయోజనాలు కాపాడుకునేందుకు కట్టుబడి ఉన్నామని చైనా ప్రకటన విడుదల చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories