America: అంతర్జాతీయ ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు ఎత్తివేత

America: అమెరికా-భారత్‌ మధ్య రాకపోకలు ప్రారంభం

Sandeep Eggoju
Published on: 8 Nov 2021 8:53 PM IST
America Lifts the Travel Ban For Vaccinated Foreigners
X

అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా (ఫైల్ ఇమేజ్)

America: అంతర్జాతీయ ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు ఎత్తివేసింది. దీంతో ఆదేశానికి భారతీయులు తరలివెళ్తున్నారు. నేటి నుంచి అమెరికా - భారత్‌ మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి. అయితే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకున్న వారిని అనుమతిస్తున్నట్లు అగ్రరాజ్యం చెబుతోంది. కోవిడ్‌ కారణంగా గతేడాది మార్చి 23న అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తూ అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం కోవిడ్‌-19 వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తూనే సాధారణ ప్రయాణాలను పునురుద్ధరించడం తమ లక్ష్యమని ఆదేశం పేర్కొంటోంది. భారత్‌ సహా చైనా, మెక్సికో, కెనడా, ఐరోపాకు చెందిన ప్రయాణికులపై కూడా యూఎస్‌ ఆంక్షలను తొలగించింది. నిబంధలను ఉల్లంఘించినవారిపై 35వేల డాలర్ల వరకూ జరిమానా విధించనున్నట్లు అమెరికా స్పష్టం చేసింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story