Afghanistan: తాలిబన్ల చెరనుంచి బయటపడిన 85 మంది భారతీయులు

* సీ -130 ఎయిర్ ఫోర్స్ విమానంలో భారత్ చేరుకున్న భారతీయులు * విడతల వారీగా భారతీయులను తరలిస్తున్న కేంద్రం

Sandeep Reddy
Published on: 21 Aug 2021 5:15 PM IST
85 Indians Escaped From The Afghanistan Taliban to India
X

తాలిబన్ల చెరనుంచి బయటపడిన 85 మంది భారతీయులు (ట్విట్టర్ ఫోటో)

Afghanistan: కాబూల్ లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపును కేంద్రం వేగవంతం చేసింది. వారందరినీ దశల వారీగా భారత్ కు రప్పిస్తోంది. తాజాగా సీ -130 ఎయిర్ ఫోర్స్ విమానంలో 85 మంది భారతీయులు భారత్ చేరుకున్నారు. కాబూల్ లో వివిధ ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కాబూల్ ఎయిర్ పోర్టుకు చేర్చి వారికి భోజన సదుపాయం కల్పించారు. ఐఏఎఫ్ విమానాలు ముందు తజకిస్థాన్ లో ల్యాండ్ అయి అక్కడ రీఫ్యూయలింగ్ చేసుకుని అక్కడనుంచి కాబూల్ చేరుకుంటున్నాయి.

కాబూల్ నుంచి భారతీయులను తీసుకుని తజకిస్తాన్ లోని దుషాంబే ఎయిర్ పోర్టుకు తరలించి అక్కడ నుంచి నెమ్మదిగా భారత్ కు తీసుకొస్తున్నారు. ఆప్ఘనిస్తాన్ లో భారతీయులకు తాలిబన్ల నుంచి పాకిస్థాన్ ఉగ్రమూకల నుంచి ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రకటించిన నేపధ్యంలో వారిని ముందు తజకిస్థాన్ కు తరలించి ఆపై భారత్ కు తీసుకొస్తున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story