Kuwait: కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 41 మందికి పైగా సజీవదహనం

Kuwait Fire: కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Arun Chilukuri
Published on: 12 Jun 2024 3:52 PM IST
41 Dead In Fire Accident At Kuwait Building
X

Kuwait: కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 41 మందికి పైగా సజీవదహనం

Kuwait Fire: కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 41 మందికి పైగా సజీవదహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే మృతుల్లో పలువురు భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణ మంగాఫ్‌ జిల్లాలోని ఓ ఆరు అంతస్తుల భవనంలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని సందర్శించిన కువైట్‌ ఉప ప్రధాని ఫహాద్‌ యూసఫ్‌ అల్‌ సబా పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. భవనం యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story