Nigeria: నైజీరియాలో 317 మంది విద్యార్థుల కిడ్నాప్

Nigeria: శుక్రవారం ఉదయం స్కూల్‌పై దాడి చేసి * హాస్టల్‌లోని విద్యార్థినులను తీసుకెళ్లిన దుండగులు

Sandeep Eggoju
Updated on: 27 Feb 2021 2:03 PM IST
317 Students kidnaped In Nigeria
X

Representational Image

Nigeria: నైజీరియాలో విద్యార్థుల కిడ్నాప్‌ కలకలం రేపింది. ఓ ప్రభుత్వ బాలికల పాఠశాలపై శుక్రవారం ఉదయం దాడిచేసిన దుండగులు.. హాస్టల్‌లోని 300 మంది బాలికలను కిడ్నాప్ చేశారు. జాంగేబ్‌లోని ప్రభుత్వ సెకెండరీ పాఠశాల దగ్గరకు వచ్చిన దుండగులు అక్కడే కొన్ని గంటల పాటు వేచి చూసి దాడి చేశారు. తమకు అడ్డు తగలకుండా స్కూల్‌కు దగ్గర్లోని సైనిక శిబిరం, చెక్‌పోస్టులపై కూడా దాడికి తెగబడినట్లు స్థానికులు తెలిపారు.

అయితే డబ్బు కోసం, జైలులో ఉన్న తమ సభ్యుల విడుదల కోసం బందిపోటు ముఠాలు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లు జామ్‌ఫరా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. విద్యార్థులను సురక్షితంగా విడిపించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. కొద్ది రోజుల క్రితమే కంగారాలోని ఓ ప్రభుత్వ కళాశాల నుంచి విద్యార్థులు, టీచర్లు సహా 42 మందిని దుండగులు అపహరించగా.. 2014 ఏప్రిల్‌లోనూ స్కూల్‌ నుంచి 276 మంది బాలికలను అపహరించుకుపోయారు. వారి జాడ ఇప్పటికీ తెలియరాలేదు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story